వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫర్దీన్‌ఖాన్‌కు బెయిల్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి; మాదకద్రవ్యాల కేసులో అరెస్టయిన హిందీనటుడు ఫర్దీన్‌ఖాన్‌కు కోర్టు బెయిలు మంజూరు చేసింది. ప్రాసిక్యూషన్‌ ప్రవేశపెట్టిన సాక్ష్యాలు బలంగా లేనికారణంగా ఫర్దీన్‌ను బెయిల్‌పై విడుదల చేస్తున్నట్టుగా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి ఎంఎస్‌ కినీ చెప్పారు.

ఖాన్‌ మాదకద్రన్యాలను కొనుగోలు చేసినట్టుగా, పోలీసులు అరెస్టుచేసిన మాదకద్రవ్యాల ఏజెంట్‌తో లావాదేవీలు జరిపినట్టుగా ప్రాసిక్యూషన్‌ నిరూపించలేకపోయిందని న్యాయమూర్తి అన్నారు. 20 వేల రూపాయల నగదు, పాస్‌పోర్టును పూచీగా తీసుకుని ఫర్దీన్‌ను విడుదల చేయాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు కరీంషేక్‌, టోనీ గోమ్స్‌కు మాత్రం న్యాయమూర్తి బెయిల్‌ నిరాకరించడమే కాకుండా నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బోర్డు కస్టడీలలో వుంచుతూ ఆదేశాలు జారీ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X