డబ్ల్యూటిఓ హయాంలో కలబడితేనే నిలబడతాం
హైదరాబాద్ః డబ్ల్యూ.టి.ఓ. ఒప్పందం కారణంగా కొన్ని నష్టాలతో పాటు లాభాలు కూడా వున్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. డబ్ల్యూ.టి.ఓ. ఒప్పందం ప్రభావంపై పలువురు ప్రముఖులతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఒక సమావేశం ఏర్పాటు చేసింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు కోటగిరి విద్యాధర రావు, వడ్డే శోభనాద్రీశ్వర రావు తదితరులు ఈ సమావేశంలో ప్రసంగించారు.
వ్యవసాయ రంగంలో అంతర్జాతీయ పోటీని తట్టుకొనేందుకు భారత రైతులను సమాయత్తం చేయడంలో కేంద్ర ప్రభుత్వంవిఫలమైందని వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు అభిప్రాయపడ్డారు. తక్కువ వ్యయంతో అధిక ఉత్పత్తి సాధించేందుకు అవసరమైన విధానాలను అమలు చేయాలని, అప్పుడే భారత రైతులు అంతర్జాతీయ పోటీని తట్టుకో గలుగుతారని వడ్డే అన్నారు.
పారిశ్రామికరంగం మరింత కట్టుదిట్టంగా మారినప్పుడే అంతర్జాతీయ పోటీని తట్టుకోగలవని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కోటగిరి విద్యాధర రావు అన్నారు. పరిశ్రమలు అన్ని రంగాలలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఈ సమావేశంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పలువులు డబ్ల్యూ.టి.ఓ. ఒప్పందంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!