• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డబ్లుటివో పై బాబు ఆందోళన

By Staff
|

హైదరాబాద్‌: ప్రపంచ వాణిజ్య సంస్థ వల్ల రాష్ట్రం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కునే అవకాశం వున్నదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు ముందుచూపు లేకుండా కుదుర్చుకున్న ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకునే అవకాశం ఇప్పుడు లేదని, శుక్రవారం నాడు హైదరాబాద్‌లో డబ్లుటివో ఒప్పందాల ప్రభావం పై జరిగిన సదస్సులో మాట్లాడుతూ ఆయన చెప్పారు.

మేధావులు, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు హాజరైన ఈ సదస్సులో రాష్ట్ర మంత్రులు విద్యాధరరావు, వడ్డె శోభనాద్రీశ్వరరావు కూడా పాల్గొన్నారు.డబ్లుటివో ఒప్పందాన్ని ఆసరాగా చేసుకుని అభివృద్ధి చెందిన సంపన్నరాజ్యాలు వర్ధమాన, పేద దేశాలను తమ ఉత్పత్తుల డంపింగ్‌కు కేంద్రాలుగా మారుస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. దీనివల్ల ఆయా దేశాల్లోని దేశీయ పారిశ్రామరంగం మార్కెటింగ్‌ వ్యవస్థలు ధ్వంసం అయ్యే ప్రమాదం వున్నదని ఆయన చెప్పారు.

డబ్లుటివో ఒప్పందంలో మనం భాగస్వాములుగానే వున్నప్పటికీ ఒప్పందాన్ని అమలు చేయాల్సిన అధికార యంత్రాంగానికి ఈ ఒప్పందంపై సరైన అవగాహనలేకపోవడం విషాదమని ఆయన చెప్పారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి వున్నదని ఆయన పేర్కొన్నారు. మౌలికవసతుల లేమి, వనరుల కొరత, అవగాహనరాహిత్యం వెరసి డబ్లుటివో ఒప్పందాలు ఇక్కడ సంక్షోభం సృష్టించడానికి మార్గం సుగమం చేశాయని చంద్రబాబు అన్నారు. డబ్లుటివో ఒప్పందాలనువ్యతిరేకించడానికి వీలుగా కేంద్రంపై వత్తిడి తేవడానికి తాము సిద్ధంగా వున్నామని ఆయన స్పష్టం చేశారు.

మన వాదనను అంతర్జాతీయ వేదికపై శక్తిమంతంగా వినిపించలేకపోతున్నామని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 21న ఢిల్లీలో జరుగుతున్న ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా తాను డబ్లుటివో వ్యవహారం లేవనెత్తనున్నట్టుగా ఆయన చెప్పారు.

  • కలబడితేనే నిలబడతాం
  • తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more