• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎన్‌డిఎ గూట్లోకి అజిత్‌సింగ్‌?

By Staff
|

న్యూఢిల్లీ: రాష్ట్రీయ లోక్‌దళ్‌ నేత అజిత్‌ సింగ్‌ ఎన్‌డిఎ కూటమిలో చేరనున్నారని రాజధానిలో వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. శనివారం సాయంత్రం అజిత్‌ సింగ్‌ ప్రధానితో సమావేశానికి అపాయిమెంట్‌ కోరడం ఈ వార్తలను విశ్వసించేట్టుగా చేస్తున్నది.

తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎన్‌డిఎతో తెగతెంపులు చేసుకున్నతర్వాత పార్లమెంట్‌లో తమ కూటమి స్థానాన్ని బలోపేతం చేసేందుకు ఎన్‌డిఎ నేతలు ప్రయత్నిస్తున్న విషయం విదితమే. చత్తీస్‌ఘర్‌, ఉత్తరాంచల్‌, జార్ఖండ్‌ బాటలోనే యుపిలో మరో కొత్త రాష్ట్రం హరిత్‌ ప్రదేశ్‌ ఏర్పాటు చేయాల్సిందిగా ప్రధానిని కోరేందుకు అజిత్‌సింగ్‌ అపాయింట్‌మెంట్‌ కోరారని, వెంటనే ఎన్‌డిఎలో చేరే ఉద్దశ్యం ఆయనకు లేదని రాష్ట్రీయ లోక్‌దళ్‌ వర్గాలు అంటున్నాయి.

హరిత్‌ ప్రదేశ్‌ ప్రతిపాదనను అజిత్‌సింగ్‌ తండ్రి చరణ్‌సింగ్‌ జనతాపార్టీ హయాంలో తొలిసారిగా చేశారు. జాట్‌ల ప్రాభల్యం అధికంగా వున్న పశ్చిమఉత్తరప్రదేశ్‌ జిల్లాలతో కలసి ఈ కొత్త రాష్ట్రం ఏర్పాటుకు అజిత్‌ డిమాండ్‌ చేస్తున్నారు. హరిత్‌ ప్రదేశ్‌ డిమాండ్‌ విషయం ఎలా వున్నా ముందుగా అజిత్‌ ఎన్‌డిఎలో చేర్చుకుని మంత్రిపదవి కట్టబెట్టే ఆలోచనలో ప్రధాని వున్నారని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X