• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎండలకుఒక్కరోజే 23 మంది మృతి

By Staff
|

హైదరాబాద్‌:తీవ్రవమైన ఎండలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారంఒక్కరోజే 23 మంది చనిపోయారు. ఉత్తారాంధ్ర తప్ప రాష్ట్రమంతానిప్పుల కొలిమిని తలపించింది. వరంగల్‌ జిల్లాహసన్‌ పర్తి మండలం అంబాలలో ఇద్దరు కూలీలువడదెబ్బకు మృత్యవాత పడ్డారు. వీరు కరీంనగర్‌ జిల్లాకొత్తకొండకు చెందినవారు. ట్రాక్టర్‌లోవెళ్తుండగా నలుగురు కూలీలకు ఒక్కసారిగా వాంతులు,విరేచనాలు మొదలయ్యాయి. వారిని రోడ్డ పక్క చెట్లకింద ఉంచగా గంట సేపటిలోనే ఇద్దరు మరణించారు.మరో ఇద్దరిని ఆస్పత్రిలో చేర్చారు.

ఆదిలాబాద్‌ జిల్లా నలుగురుమరణించారు. సిర్పూర్‌ (యు) మండలం చిన్ననేట్నూర్‌లో ఒక మహిళ పొలం పనికి వెళ్లిమరణించింది. గ్రామంలో మరో ముగ్గురువడదెబ్బకు గురయ్యారు. మంచిర్యాలమండలం అల్లూరి సీతారామారాజు నగర్‌ వద్ద సింగరేణి కార్మికుడు,దండేపల్లి మండలం వెల్గనూర్‌కు చెందిన కూలీమరణించారు. ఇంద్రవెల్లి మండలంరాంనగర్‌లో ఒక మహిళా కూలీ మరణించింది.విజయవాడలో ఒక యాచకుడు, ఒక రిక్షా కార్మికుడు మృతిచెందారు.

అనంతపురం జిల్లా తాడిపత్రిలోఇద్దరు చిన్న వ్యాపారులు మరణించారు. కరీంనగర్‌ జిల్లా జ్యోతినగర్‌లో ఒకవడ్రంగి, ఖమ్మం జిల్లా దుమ్ముగూడెంమండలం లక్ష్మీనగరానికి చెందిన రైతు మృతిచెందారు.

కడప జిల్లా రైల్వేకోడూరులోహోటల్‌ నడుపుకునే స్త్రీ, వీరబల్లిమండలం రెడ్డివారిపల్లెకు చెందిన వృద్ధురాలుమరణించారు. రాజమండ్రిలో హోటల్‌ యజమానివడదెబ్బకు మృత్యవాత పడ్డాడు. గుంటూరు జిల్లా కారంపూడి ప్రాంతంలోముగ్గురు మరణించారు. కడప జిల్లా వెలిదండ్లకుచెందిన వడ్రంగి మృతి చెందాడు. చిత్తూరు జిల్లాశ్రీకాళహస్తి సదుం ప్రాంతంలో మరో ఇద్దరువడదెబ్బకు ప్రాణాలు విడిచారు. నల్లగొండ జిల్లా దేవరకొండబస్‌ సేషన్‌లో 60 ఏళ్ల బిచ్చగత్తె మరణించింది.మహబూబ్‌నగర్‌లో ఓ యువకుడు మరణించాడు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more