వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గూడేపల్లిపై వార్ దాడి
వరంగల్ : వరంగల్ జిల్లా గూడేపల్లి గ్రామంపై సోమవారం రాత్రి పీపుల్స్వార్నక్సలైట్లుగా భావిస్తున్న సాయుధులు దాడి చేశారు. గ్రామస్తులను విచక్షణారహితంగా చితకబాదారు. దాదాపు 30 మందివరకూ వున్న సాయుధుల బృందం గ్రామంలో కనిపించిన వారినందనీ తీవ్రంగా గాయపరిచింది.
దాడిలో మొత్తం 17 మంది గ్రామస్తులు తీవ్రంగా గాయడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం వరంగల్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ గ్రామస్తులలో కొందరికి కాళ్లూ, చేతులు విరగగా, మరికొందరికి తలలు పగిలాయి. గూడేపల్లికి చెందిన రాఘవరెడ్డి ఇంటిని నక్సల్స్ గత నెలలో పేల్చివేసేందుకు పూనుకోగా తాము అడ్డుకున్నామని, దీంతో కక్ష బూనిన నక్సల్స్ సోమవారం నాడు దాడి చేశారని గాయపడ్డ గ్రామస్తులు తెలిపారు.
Comments
Story first published: Tuesday, May 15, 2001, 23:53 [IST]