వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపు కేరళ సిఎంగా ఆంటోనీ ప్రమాణం

By Staff
|
Google Oneindia TeluguNews

తిరువనంతపురంః కేరళ ముఖ్యమంత్రిగాఎ.కె. ఆంటోని గురువారం ఉదయం 10.45 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. కేరళ కాంగ్రెస్‌ లెజిల్లేచర్‌ పార్టీ నేతగాఎ.కె. ఆంటోనీ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికైనవిషయం విదితమే.

ఆయన బుధవారం రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.ఎస్‌. కాంగ్‌ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్‌ ఆంటోనీకి వర్తమానం పంపడంతో ఆయన కేరళ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టేందుకు మార్గం సుగమంఅయింది.

ఎనిమిది పార్టీల యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ కేరళఅసెంబ్లీ ఎన్నికల్లో విజయభేరి మోగించిన విషయంవిదితమే. ఎ.కె. ఆంటోనితో పాటు మరికొందరు క్యాబినెట్‌ సహచరులు కూడా గురువారం ప్రమాణస్వీకారం చేస్తారని భావిస్తున్నారు. కరుణాకరన్‌ ను బుజ్జగించే సరికి ఆంటోనీ తలప్రాణం తోకకు వచ్చింది. ఇక భాగస్వామ్య పార్టీలవిషయంలో సమతూకం పాటించి, ఎవరికీ కోపతాపాలు రాకుండా మంత్రి వర్గం ఏర్పాటు చేయడం ఆంటోనీకి కత్తిమీద సామే అవుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

  • కేరళ కొత్త సిఎం ఎకె ఆంటోనీ
  • కేరళకు ఎఐసిసి ప్రతినిధులు
  • కేరళలో యుడిఎఫ్‌ విజయం
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X