వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో కిష్కింధకాండ-వెయ్యిమంది పోలీసుల వేట

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజులుగా కోతి ఆకారంలో వున్న ఓ వింత జీవి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నది. ఈ వానరం అర్థరాత్రి సమయంలో ప్రజలపై దాడి చేసింది. సోమ, మంగళ వారాలలో ఈ వానరం దాడిలో వంద మంది వరకు గాయపడ్డారు. ప్రమాద వశాత్తు ఒక వ్యక్తి కూడా మరణించారు.

మిస్టరీగా మారిన ఈ వింత ఆకారాన్ని పట్టుకొనేందుకు మంగళవారం ఢిల్లీపోలీసులు రంగంలోకి దిగారు. సుమారు వెయ్యి మంది పోలీసులు ప్రజలను భయభ్రాంతులను చేస్తున్న ఈ వింత ఆకారం అంతు చూసేందుకు కృషి చేస్తున్నారు.

మరో వైపు ఈ వింత ఆకారం బారిన పడిన వారి ఉదంతాలు ఒకొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కోతి ఆకారంలో మనిషిలా వున్న వింత ప్రాణి దాడి చేయడంతో నోయిడాలోఅపార్ట్‌ మెంట్‌ పైభాగంలో నిద్రిస్తున్న వారు పెద్దగాఅరుచుకుంటూ పరుగులు తీశారు. ఓ వ్యక్తి ఏకంగా అపార్ట్‌ మెంట్‌ పై నుంచి భయంతో దూకడంతో మరణించాడు. ఈ వింత జీవి ఒకటేనా? లేక రెండు మూడు వింత జీవాలు ఢిల్లీ ప్రజలపై దాడులు చేస్తున్నాయా? అనే అనుమానం కూడా వ్యక్తం అవుతున్నది.

ఈ వానరం నల్లగా దృఢంగా వుంది. 30 అడుగుల ఎత్తువరకు పెరుగుతున్నదని ఆ వానరం దాడిలో గాయపడిన వారు చెబుతున్నారు. కాళ్ళకు ఇనప బూట్లు వేసుకుందని మరి కొందరు చెబుతున్నారు. మొత్తంమీద ఢిల్లీలో ఈ వింత ఆకారం గురించిన పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రెండు రోజులుగా రాత్రిళ్ళు మాత్రమే ప్రజలపై దాడి చేస్తున్న ఈ వానరం సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలోఒకరిపై దాడి చేయడంతో పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X