• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చైనాఉత్పత్తులపై అప్రమత్తం: బాబు

By Staff
|

రాజమండ్రి,ఏలూరు: చైనా ఉత్పత్తుల పట్ల అప్రమత్తతఅవసరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుఅన్నారు. ఆయన గురువారం తూర్పు, పశ్చిమ గోదావరిజిల్లాల్లో పర్యటించారు. చైన కారు చౌకగా ఉత్పత్తులుతయారు చేసి, మన దేశ మార్కెట్‌ను వాటితో ముంచెత్తేప్రమాదం వున్నదని ఆయన అన్నారు.రాజమండ్రిలో ఆయన మార్కెట్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన అనంతరం జరిగినబహిరంగ సభలో చైనా ఉత్పత్తుల గురించి మాట్లాడారు.

ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యుటివో) ఒప్పందంపై భారతదేశం సంతకం చేసిననేపథ్యంలో చైనా ఉత్పత్తుల పట్ల అప్రమత్తతంగావ్యవహరించక తప్పదని ఆయన అన్నారు.డిబ్ల్యుటివోపై స్పష్టమైన అవగాహనకువచ్చి దేశీయ పరిశ్రమల పరిరక్షణకుకేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సినఅవసరం వున్నదని ఆయన అన్నారు. డబ్ల్యుటివోఒప్పందం వల్ల సంభవించే పరిణామాలపై చర్చించడానికి ప్రధానిఅటల్‌ బిహారీ వాజ్‌పేయి ఈ నెల 21వ తేదీన ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసినట్లుఆయన తెలిపారు.

రైతుల నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లను వేగవంతంచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లుఆయన తెలిపారు. ధాన్యం కొనుగోళ్లను రోజువారీగా సమీక్షించి కొనుగోళ్లను వేగవంతం చేస్తామనిఆయన చెప్పారు. తాము 50 వేల మెట్రిట్‌ టన్నుల ధాన్యం కొనుగోలుచేస్తున్నట్లు, రైతులను ఆదుకోవడానికి అన్నిచర్యలూ తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

నిడదవోలు మున్సిపాలిటీలోఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. గురువారంఉదయం ఏడున్నర గంటలకే ఆయన ఉభయగోదావరి జిల్లాల పర్యటనప్రారంభమైంది.

కాకినాడలో ఆయన నాగార్జునఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ నిర్వహించిన ఒకకార్యక్రమంలో పాల్గొన్నారు. విశేష ఉత్పత్తి సాధించినందుకు కంపెనీనిఆయన అభినందించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more