• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జింబాబ్వే పర్యటనకు భారత జట్టు ఎంపిక

By Staff
|

బెంగుళూర్‌: జింబాబ్వేజట్టుతో ఆడే రెండు టెస్టుల సిరీస్‌కు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బిసిసిఐ) 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును గురువారంప్రకటించింది. ఇందులో ఏడుగురు బ్యాట్స్‌మెన్‌,ఏడుగురు బౌలర్లు, ఒక వికెట్‌ కీపర్‌ వున్నారు. ఐదుగురుసీమర్లకు జట్టులో స్థానం కల్పించడం విశేషం. భారత జట్టు ఈనెల 24వ తేదీన జింబాబ్వే బయలుదేరివెళ్తుంది.

జింబాబ్వే పిచ్‌లను పరిగణనలోకి తీసుకుని ఈ ఎంపిక చేశామనిబిసిసినై కార్యదర్శి జయవంత్‌ లెలె విలేకరులతోచెప్పారు. జింబాబ్వే, వెస్టిండీస్‌, భారత్‌ల మధ్యజరిగే ముక్కోణపు వన్డే పోటీలకు భారత జట్టునుజూన్‌ రెండవ వారంలో ఎంపిక చేయనున్నట్లుఆయన తెలిపారు. జట్టు ఎంపిక పట్ల సెలెక్టర్లందరూ హర్షంవ్యక్తం చేశారని ఆయన చెప్పారు. వికెట్‌ కీపర్లుగావిజయ్‌ దహియా, నయన్‌ మోంగ్యాల గురించిచర్చనే జరగలేదని ఆయన అన్నారు. బదానినిబ్యాట్స్‌మన్‌గానే ఎంపిక చేశామని, అవసరమైతే బౌలింగ్‌ కూడాచేయగలడని ఆయన చెప్పారు. సచిన్‌టెండూల్కర్‌, సౌరబ్‌ గంగూలీలు కూడా బౌలింగ్‌చేయగలరని ఆయన అన్నారు.

వన్డే సరీస్‌కు 14 మందితో జట్టును ఎంపికచేస్తామని, ఈ ఎంపిక ముంబాయిలో జరుగుతుందనిఆయన చెప్పారు.

భారత జట్టు: సౌరబ్‌ గంగూలీ(కెప్టెన్‌), రాహుల్‌ ద్రావిడ్‌ (వైస్‌-కెప్టెన్‌),సచిన్‌ టెండూల్కర్‌, వివియస్‌ లక్ష్మణ్‌,షడగోపన్‌ రమేష్‌, శివసుందర్‌ దాస్‌,హేమంగ్‌ బదాని, సమీర్‌దిఘే, జవగళ్‌ శ్రీనాథ్‌, అజిత్‌ అగార్కర్‌, జహీర్‌ఖాన్‌,దేవశీస్‌ మొహంతి, ఆశిష్‌ నెహ్రా, హర్బజన్‌సింగ్‌, సైరాజ్‌ బహుతులే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X