వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణా సాధించే వరకూవిశ్రమించం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌, కరీంనగర్‌ : తెలంగాణా రాష్ట్ర సమితి గురువారం నాడు కరీనగర్‌లో నిర్వహించిన సింహగర్జన అంచనాలకు మించి సక్సెస్‌ అయ్యింది. ఎండలు మండిపోతున్నప్పటికీ లక్షలాది మంది తెలంగాణా ప్రజలు గర్జనకు హాజరై ప్రత్యేక తెంగాణాపై తమ మనోభావాన్ని వ్యక్త పరిచారు.

గురువారం ఉదయం పది గంటప్రాంతంలో హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయం నుండి సుమారు వెయ్యి వాహనాలతో కరీంనగర్‌కు ర్యాలీ బయలుదేరింది. హైదరాబాద్‌ నుంచి కరీనగర్‌ వరకూ సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్‌కు ప్రజలు బ్రహ్మరధం పట్టారు. మార్గమధ్యంలో పలుచోట్ల చంద్రశేఖరరావు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దారిపొడవునా మండుటెండలో వేలాది మంది ప్రజలు ర్యాలీని అనుసరించారు. దారి పొడవునా ప్రజలు తండోపండాలుగా తరలిరావటంతో ర్యాలీ కరీంనగర్‌కు అనుకున్న సమయానికి చేరలేకపోయింది. ర్యాలీలో జార్ఖండ్‌ ముక్తి మోర్చా నాయకుడు శిబుసోరెన్‌ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చంద్రశేఖరరావు మాట్లాడుతూ మాది దీర్ఘకాలిక యుద్ధమని ప్రకటించారు. గర్జనతో తెలంగాణా ఉద్యమానికి కొత్త ఊపిరి వచ్చిందని ఆయన అన్నారు. ఇక ఇప్పటినుంచీ ఉద్యమం మరింత ఊపందుకుంటుందని ఆయన ప్రకటించారు.

తమను బిజెపి, కాంగ్రెస్‌లు విమర్శించటం విడ్డూరంగావున్నదని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణాను తామూ కోరుతున్నామని చెబుతున్న కాంగ్రెస్‌, బిజెపిలు తమను విమర్శించాల్సిన అవసరమేమున్నదని ఆయన ప్రశ్నించారు.

కాంగ్రెస్‌, బిజెపిలకు ఏమాత్రం నిజాయితీ వున్నా తెలంగాణా కోసం ఉద్యమిస్తున్న తమను విమర్శించటం మాని, తెలంగాణా వద్దంటున్న చంద్రబాబుపై తమ దాడి ఎక్కుపెట్టాలని ఆయన కోరారు.

నిన్నటివరకూ పదవులకోసం తాము ఉద్యమిస్తున్నామని కొందరు విమర్శించారు. నేను పదవిని వొదులుకున్నాను. దాంతో వాళ్ల నోటికి తాళం పడింది. ఇప్పడు మమ్మల్ని అసంతృప్తి వాదులంటున్నారు. అయినా ప్రజలు వాళ్ల మాటల్ని నమ్మే స్ధితిలో లేరని చంద్రశేఖరరావు అన్నారు. ఇప్పటికయినా ఇలాంటి విమర్శలు మాని, నోళ్లు మూసుకుని వుండాలని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.

44ఏళ్ల పాటు జరిగిన అన్యాయం అతం కావాలంటే ప్రత్యేక తెలంగాణా ఒక్కటేమార్గమని ఆయన అన్నారు.
సంస్కరణల పేరుతో చంద్రబాబు నాయుడు సాగిస్తూవున్న పాలన తెలంగాణా ప్రజలకు ఉరితాళ్లు బిగిస్తున్నదని ఆయన విమర్శించారు. చంద్రబాబు నాయుడు పాలనలో తెలంగాణాకు జరుగున్న అన్యాయం పతాకస్ధాయికి చేరుకున్నదని, అయినప్పటికీ భరిస్తూ మౌనంగా ఉందామా?అని ప్రజలను ప్రశ్నించారు. ప్రత్యేక తెంగాణా సాధించే వరకూ తాము విశ్రమించమని చంద్రశేఖరరావు స్పష్టంచేశారు. ప్రత్యేక తెలంగాణాకోసం ఎంతటి త్యాగానికైనా తాను సిద్ధమేనని చంద్రశేఖరరావు స్పష్టం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X