వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బెంగాల్ సిఎంగా బుద్ధదేవ్ ప్రమాణం
కోల్ కతాః పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బుద్ధదేవ్ భట్టాచార్య శుక్రవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు 34 మంది కేబినెట్ మంత్రులుగా, 14 మంది సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
గతంతో పోలిస్తే బుద్ధదేవ్ క్యాబినెట్ పెద్దదిగానే కనిపించింది. వామపక్ష భాగస్వామ్య పార్టీలకు సముచిత స్థానం కల్పించే ఉద్దేశ్యంతో బుద్ధదేవ్ ఎయిర్ బస్ క్యాబినెట్ ఏర్పాటు చేశారు. ఫార్వార్డ్ బ్లాక్ కు చెందిన 9 మందికి, ఇద్దరు సిపిఐ సభ్యులకు మంత్రి పదవులు దక్కాయి.
బుద్ధదేవ్ కొలువులో 17 మంది కొత్త వారికి మంత్రి పదవులు లభించాయి. పశ్చిమ బెంగాల్ ను ఆదర్శ రాష్ట్రంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తానని బుద్ధదేవ్ ఈ సందర్భంగా ప్రకటించారు.
Comments
Story first published: Friday, May 18, 2001, 23:53 [IST]