వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వానరం దాడులుతో వణుకుతున్న ఢిల్లీ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః వింత ఆకారం దాడులతో దేశ రాజధాని నగరం ఢిల్లీ గజగజలాడి పోతున్నది. రెండు రోజులుగా దాడుల తీవ్రత కాస్త తగ్గించిన ఈ వింత ఆకారం బుధవారం రాత్రి మళ్ళీ విజృంభించింది. బుధ, గురువారాలలో ఈ వింత ఆకారం జరిపిన దాడులలో 18 మంది గాయపడ్డారు. వింత ఆకారం దాడికి భయపడి డాబామీద నుంచి పడి ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. వెయ్యిమంది పోలీసులు రేయింబవళ్ళు ఈ వింత ఆకారం కోసం గాలింపు చేపడుతున్నప్పటికీ, ఆ ఆకారం యదేశ్ఛగా దాడులు కొనసాగించడంవిశేషం.

బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఈ వింత ఆకారం దాడిలో 18 మంది గాయపడ్డారు.వీరిలో ఇద్దరి తలలకు తీవ్రంగా గాయాలయ్యాయి.వీరి పరిస్థితి ఆందోళన కరంగా వున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. రాత్రిళ్ళు డాబాలమీద పడుకున్న వారిని ఈ వింత ఆకారం టార్గెట్‌ చేసుకొని దాడులు చేస్తున్నది. ఇంత వరకు ఈ వింత ఆకారం రూపు రేఖలపై ఢిల్లీ పోలీసులు ఒక స్పష్టమైన అభిప్రాయానికి రాలేక పోయారు. ఈ వారం రోజులలో ఈ వింత ఆకారం దాడులకు ఇద్దరు మరణించగా కనీసం 50 మంది గాయపడ్డారు.

ఢిల్లీ పోలీసుల బుర్రలు తొలిచేస్తున్న ఈ వింత ఆకారం వ్యవహారం నానాటికీ జటిలం అవుతున్నది. లైట్‌ పిస్టళ్ళతో రాత్రుళ్ళు వెయ్యి మంది పోలీసులు గస్తీ తిరుగుతున్నారు. ఈ వింత ఆకారాన్ని కనిపిస్తే కాల్చివేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఆకారం గురించి ఢిల్లీలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తల్లిదండ్రులు పిల్లలను బయటకు పంపాలంటే భయపడి పోతున్నారు. శివారు ప్రజలు ప్రాణాలు అరచేతిలోపెట్టుకొని గడుపుతున్నారు.

  • ఢిల్లీలో కిష్కింధకాండ-వెయ్యిమంది పోలీసుల వేట
  • పోలీసుగస్తీతో మాయమైన ఢిల్లీ వానరం!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X