• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సింహగర్జనకు జన ప్రభంజనం

By Staff
|

కరీంనగర్‌ః ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోరుతూ మాజీ డిప్యూటిస్పీకర్‌ చంద్రశేఖర రావు సారధ్యంలో ఏర్పాటైన తెలంగాణా రాష్ట్ర సమితి(టి.ఆర్‌.ఎస్‌) గురువారం కరీంనగర్‌ లో నిర్వహించిన సింహగర్జనకు అనూహ్య స్పందన లభించింది. వేలాదిగా ప్రజలుస్వచ్ఛందంగా సభకు తరలి రావడం విశేషం. కేవలం 20 రోజుల కిందట ప్రారంభించిన టి.ఆర్‌.ఎస్‌. సభకు ఇంత భారీ ఎత్తున జనం తరలిరావడంతో పార్టీ నేతలలో హర్షాతిరేకం వ్యక్తం కాగా ఇతర రాజకీయ పార్టీలు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాయి.

తెలంగాణాలోని అన్ని జిల్లాల నుంచి ముఖ్యంగా ఉత్తర తెలంగాణా జిల్లాల నుంచి జనం తండోపతండాలుగా తరలి వచ్చారు. కరీంనగర్‌ లోని ఎస్‌.ఆర్‌.ఆర్‌. కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సింహగర్జన సభాస్థలి జనంతో కిటకిటలాడిపోయింది. హైదరాబాద్‌, జగిత్యాల, కామారెడ్డి, గోదావరిఖని నుంచి వేలాది వాహనాలు ప్రవాహంలో కరీంనగర్‌ చేరుకున్నాయి.

చంద్రకు అడుగడుగునా స్వాగతం

హైదరాబాద్‌ లోని పార్టీ కార్యాలయం వున్న జలదృశ్యం నుంచి కరీంనగర్‌ సింహగర్జనకు బయలుదేరిన చంద్రశేఖర రావుకు అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. జలదృశ్యం నుంచి బయలు దేరగానే ట్యాంక్‌ బండ్‌పైన వున్న అంబేద్కర్‌ విగ్రహానికి చంద్రశేఖర రావు నివాళిఅర్పించి ఊరేగింపును ముందుకు సాగించారు.

చంద్రశేఖర రావు సొంతపట్టణమైన సిద్దిపేటలో ఆయనకు ప్రజలు మంగళహారతులు ఇచ్చారు. దారిపొడవునా ఆయనకు మేళతాళాలతోస్వాగతం పలికారు. వివిధ పార్టీలకు చెందిన దిగువశ్రేణి నాయకులు, ముఖ్యంగా యువకులు చంద్రశేఖర రావుకు బ్రహ్మరథం పట్టారు. మార్గమధ్యంలో కొన్ని చోట్ల పార్టీ జెండాని ఆవిష్కరించాల్సిందిగా యువకులు పట్టుపట్టడంతో చంద్రశేఖర రావు జండా ఆవిష్కరించి కొద్దిసేవు ప్రసంగించారు.

మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన చంద్రశేఖర రావు ఊరేగింపు కరీంనగర్‌ చేరుకొనే సరికి సాయంత్రం ఆరుగంటలైంది. చంద్రశేఖర్‌ వెంటే సుమారు వెయ్యి వాహనాలు కరీంనగర్‌ చేరుకున్నాయి.అప్పటికే అక్కడ వేలాది మంది జనం వేచి వున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more