వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రాంతీయ తత్వానికి టిడిపియే కారణం
అనంతపురం: రాష్ట్రంలో ప్రాంతీయతత్వం ప్రబలిపోయేందుకు తెలుగుదేశం పార్టీనే కారణమని సిఎల్పీ నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆరోపించారు. శుక్రవారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎలాంటి నీటిపారుదల ప్రాజెక్టులనూ చేపట్టనికారణంగా ఇవాళ తెలంగాణా ప్రజలు ఆత్మహత్యల పాలపడుతున్నారని ఆయన అన్నారు. ఈనేపద్యంలోనే తెలంగాణా ప్రజలు ప్రత్యేక తెలంగాణా కోసంపోరాడుతున్నారని వైఎస్ వివరించారు.
కాంగ్రెస్ హయాంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికోసం ప్రత్యేక ప్యాకేజీలను అమలు చేసి ఆప్రాంతాల ప్రజలను ఆదుకోవటం జరిగిందని వైఎస్ అన్నారు. గతంలో వున్న ప్రాంతీయ బోర్డులను తిరిగి ప్రాంరంభించాలని, రాజ్యాంగ బద్దంగా ఆ బోర్డులకు అధికారాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!