వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల ప్రభావం బిజెపి పై లేదు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పనితీరును సమీక్షించేందుకు బిజెపి జాతీయ కార్యవర్గం రెండు రోజుల సమావేశాలు ఉత్తరాంచల్‌లోని ముస్సోరిలో ఆదివారం నాడు ప్రారంభమయ్యాయి. ఈ ఎన్నికల్లో పరాజయానికి కారణాలను విశ్లేషించడంతో పాటు ఈ ఫలితాల ప్రభావం పార్టీ పై ఏవిధంగా వున్నదనే అంశంపై కూడా సమవేశంలో చర్చిస్తున్నారు.

ఈ ఎన్నికల ఫలితాల వల్ల తమ పార్టీకి ఇసుమంత కూడా నష్టం జరగలేదని బిజెపి అధ్యక్షుడు జనా కృష్ణమూర్తి స్పష్టం చేశారు. త్వరలో జరుగనున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు అసలు సవాలని కాంగ్రెస్‌ పార్టీకి చేతనైతే తమను ఆ ఎన్నికల్లో ఎదుర్కోవాలని ఆయన సవాలు విసిరారు. జమ్మూకాశ్మీర్‌, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటినుంచే అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఈ సమావేశం చర్చిస్తున్నది. కేంద్ర హోమంత్రి అద్వానీ ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఇదిలా వుండగా మణిపూర్‌లో కోయిజమ్‌ ప్రభుత్వానికి మద్దతు నిచ్చే విషయంలో సమతాపార్టీ నుంచి వస్తున్న వత్తిడులకు బిజెపి తలవొగ్గింది. సోమవారం నాడు జరుగనున్న బలపరీక్షలో కోయిజమ్‌ ప్రభుత్వానికి మద్దతు నివ్వాలని బిజెపి నాయకులు నిర్ణయించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X