• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నక్సల్స్‌ అరెస్టులు- భారీగా ఆయుధాలస్వాధీనం

By Staff
|

హైదరాబాద్‌: సిపిఐ (ఎంఎల్‌) జనశక్తి రాజన్న వర్గానికి చెందిన 30 మంది నక్సల్స్‌ను మెదక్‌ జిల్లా పోలీసులు అరెస్టు చేసి పెద్దయెత్తున మారణాయుధాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు జనశక్తికి చెందిన రహస్య స్థావరాలపై దాడులు నిర్వహించి పోలీసులు అరెస్టులు చేశారు. అరెస్టయినవారిలో ముగ్గురు జిల్లా కమిటీ సభ్యులు, ఇద్దరు జోనల్‌ కమిటీ సభ్యులు వున్నారు.

పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం- నక్సల్స్‌ మెదక్‌ జిల్లా అటవీ ప్రాంతంలో నక్సల్స్‌ సమావేశం అవుతున్నారనే సమాచారం అందుకుని పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లారు. పోలీసులను చూసిన నక్సలైట్లు కాల్పులు జరిపారు. పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఇరు పక్షాల మధ్య 20 నుంచి 25 నిమిషాల పాటు ఎదురు కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా ఆయుధాలు పారవేసి నక్సల్స్‌ లొంగిపోయేందుకు సిద్ధపడ్డారు. ఇక్కడ 11 మంది నక్సల్స్‌ పోలీసుల చేతికి చిక్కారు. 11 మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయుధాల్లో అమెరికా తయారీ రైఫిళ్లు, వేయి బుల్లెట్లు వున్నాయి. ఆ తర్వాత హైదరాబాద్‌లోనూ, ఇతర ప్రాంతాల్లోనూ దాడులు నిర్వహించి మరో 19 మందిని అరెస్టు చేశారు. ఈ దాడుల్లో మరో 22 మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో చైనా తయారీ పిస్టళ్లు, తుపాకులు వున్నాయి.

ఇంత పెద్ద యెత్తున మారణాయుధాలను స్వాధీనం చేసుకోవడం ఇదే ప్రథమమని శాంతిభద్రతల అదనపు డిజిపి ఉమావత్‌ చెప్పారు. వ్యాపారులను, పారిశ్రామిక వేత్తలను బెదిరించి జనశక్తి నక్సల్స్‌ పెద్ద యెత్తున డబ్బులు గుంజుతున్నారని ఆయన అన్నారు. డబ్బులు పెద్ద యెత్తున గుంజి పెద్ద యెత్తున ఆయుధాలను సమీకరించుకుంటున్నారని, ఇది ప్రమాదానికి దారి తీయగలదని ఆయన అన్నారు. ఈ పరిస్థితుల్లో జనశక్తిని కూడా నిషేధించే ఆలోచన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయమై చర్చించడానికి త్వరలో పోలీసు ఉన్నతాధికారులు సమావేశమవుతారని ఆయన చెప్పారు.

ఇదిలా వుంటే, పోలీసుల వ్యహారం అనుమానాలకు తావు ఇస్తోంది. అరెస్టులు, ఆయుధాల స్వాధీనం ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు జరిగినట్లు పోలీసు ఉన్నతాధికారులు చెప్పుతుండగా, మెదక్‌ జిల్లా పోలీసులు భారీగా అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారని, దీనికి సంబంధించినవివరాలను అందించడానికి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆదివారం మధ్యాహ్నమే మీడియా కార్యాలయాలకు ఆహ్వానం చేరింది. ఈ విషయమై ప్రశ్నించినప్పుడు పోలీసు ఉన్నతాధికారులు సరిగా సమాధానం చెప్పలేకపోయారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X