• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హిందువులపై తాలిబన్ల ఆంక్షలు

By Staff
|

న్యూఢిల్లీ: అఎn్ఘానిస్తాన్‌ను మధ్యయుగాలనాటి ఇస్లాం మత రాజ్యంగా మార్చే ప్రయత్నాల్లో వున్న తాలిబన్లు తాజాగా హిందువులను తమ టార్గెట్‌గా పెట్టుకున్నారు. హిందువులు షరియత్‌ను పాటించాలనీ, గుర్తించడానికి వీలుగా పసుపురంగు దుస్తులు ధరించాలని తాలిబన్లు డిక్రీ జారీ చేశారు. హిందూ కుటుంబాలు నివసించే ఇంటిపై రెండు మీటర్ల పసుపువస్త్రాన్ని కట్టాలని ఆదేశించారు.

హిందువులు, ముస్లీంలు ఒకే ఇంటిలో నివసించరాదని కూడా తాలిబన్లు ఆదేశించారు. ముస్లీంలతో కలసి ఒకే ఇంట్లో వుంటున్న హిందువులు తక్షణం ఇల్లు ఖాళీ చేయాలని పేర్కొన్నారు. తమ ఆదేశాలను ధిక్కరిస్తే కఠిన చర్య తప్పదని హెచ్చరించారు. అఎn్ఘానిస్తాన్‌లో ఈ మధ్య కాలంలో హిందువులపై దాడులు ముమ్మరమయ్యాయి. సంపన్న హిందూ వ్యాపారులు ఇళ్లపై దాడి చేసి దోచుకోవడం, వారిని వేధించడం నిత్యకృత్యాలుగా మారాయి. హిందువులు కొత్తగా ఆలయాలు నిర్మించరాదని, శిథిలమైన ఆలయాలను మరమ్మత్తు చేయరాదని కూడా తాలిబన్లు హెచ్చరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X