వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫిక్సింగ్‌ కొండంత-తెలిసింది గోరంత!

By Staff
|
Google Oneindia TeluguNews

లండన్‌ః మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కు పాల్పడుతున్న క్రీడాకారులు ఎవరో స్పష్టంగా పేర్కొనక పోయినప్పటికీ పాల్‌ కాండన్‌ బుధవారం వెలువరించిన నివేదిక పలు సత్యాలను ఆవిష్కరించింది. కోట్లాది అభిమానులు వేలం వెర్రిగా చూసే క్రికెట్‌ ను అడ్డుపెట్టుకొని కోట్లాది రూపాయల వ్యాపారం అదీ, క్రికెటర్ల ప్రమేయంతో ఎలా నిరాఘాటంగా సాగిపొతున్నదనే అంశంపై ఆయన వెల్లడించిన నిజాలు దిగ్భ్రాంతి కలిగిస్తాయి. వేలం వెర్రిగా క్రికెట్‌ చూసే వాళ్ళను వెర్రివాళ్ళను చేయడంలో ప్రజల అభిమాన క్రికెటర్ల పాత్ర ఎంత అనే అంశాన్ని కూడా కాండన్‌ పూసగుచ్చినట్లు చెప్పారు.

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వ్యవహారాన్ని లోతుగా పరిశీలించిన అంతర్జాతీయ క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు అవినీతి నిరోధక విభాగం అధినేత పాల్‌ కాండన్‌ బుధవారం 35 పేజీల నివేదికను విడుదల చేశారు.
ఆ నివేదిక ముఖ్యాంశాలు సమగ్రంగా...........

  • 1970 నుంచి ప్రపంచ క్రికెట్‌ ను మ్యాచ్‌ ఫిక్సింగ్‌ పట్టి పీడిస్తున్నది.
  • ఈ రోజున మ్యాచ్‌ ఫిక్సింగ్‌ గురించి ప్రజలకు తెలిసింది చాలా తక్కువ. జరుగుతున్న ఘోరాల్లో ఆవగింజంత మాత్రమే వెలుగు చూసింది.
  • ఆరు నెలల కిందట మ్యాచ్‌ ఫిక్సింగ్‌ పై నేను నివేదిక రూపొందించడం ప్రారంభించిన తరువాత మరీ బరితెగించి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కు పాల్పడేందుకు ఆటగాళ్ళు వెనకాడుతున్నారు. అయితే ఇప్పటికీ పలు అక్రమాలు జరుగుతునే వున్నాయి.
  • మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరుగుతున్నదని చాలామంది క్రికెటర్లకు తెలుసు. అయితే నోరు విప్పితే తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందనే భయంతో వాళ్ళు మాట్లాడడం లేదు. తమకు, తమ కుటుంబాలకు ఎక్కడ అపాయం కలిగిస్తారో అనే భయంతో చాలామంది ఆటగాళ్ళు నోరు విప్పడం లేదు.
  • మ్యాచ్‌ ఫిక్సర్లు మర్డర్లు, కిడ్నాప్‌ లు, బెదిరింపుల వంటి దారుణాలకు కూడా పాల్పడేందుకు వెనుకాడరు.
  • కొందరు క్రికెటర్లకు బెదిరింపులు కూడా వచ్చాయి. కిడ్నాప్‌ బెదిరింపులు వచ్చిన ఆటగాళ్ళను కూడా తాను ఇంటర్య్వూ చేయగా ఈ పచ్చి నిజాలు వెలుగు చూశాయి.
  • మ్యాచ్‌ ఫిక్సింగ్‌ విషయంలో ఆయా దేశాల క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డులు కూడా పట్టీపట్టనట్లు వ్యవహరించాయి.

    క్రికెట్‌ లో వివిధ దశల్లో బెట్టింగ్‌, మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరుగుతున్నట్లు ఆయన గుర్తించారు. అవిః
  • మ్యాచ్‌ ప్రారంభంలో టాస్‌ సమయంలో జరిగే ఫిక్సింగ్‌
  • ఆ తరువాత ఎవరు మొదట బౌలింగ్‌ చేయాలనే సందర్భంగా జరిగే ఫిక్సింగ్‌
  • వైడ్‌ లు, నో బాల్‌ లు అధికంగా వేయడం
  • ఫీల్డింగ్‌ సరిగా చేయక పోవడం, సరైన ఫీల్డింగ్‌ స్థానాలను నిర్ణయించకపోవడం.
  • తక్కువ పరుగుల చేయడం.
  • ఇన్నింగ్స్‌ లో కావాలనుకున్న సమయంలో బ్యాట్స్‌ మెన్‌ అవుట్‌ కావడం.
  • ఇన్నింగ్స్‌ ను ఎన్ని పరుగుల వద్ద డిక్లేర్‌ చేయాలనే సందర్భంలో.
  • వన్డే ఇంటర్నేషనల్స్‌ లో మొదట బ్యాటింగ్‌ చేసే వారు మొత్తం ఎన్ని పరుగులు సాధించాలనే సందర్భంగా.....

బెట్టింగ్‌, మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరుగుతున్నట్లు కాండన్‌ గుర్తించారు.

అడుగడుగునాఫిక్సింగ్‌-క్రికెట్‌ ఓ ఫార్స్‌

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X