వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరంగల్‌ లో పోలీస్‌ వార్‌ః ఇంటర్వ్యూ

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌ ః పీపుల్స్‌వార్‌ ఉద్యమ పురిటిగడ్డైన వరంగల్‌ జిల్లాలో వార్‌ గత సంవత్సర కాలంగామిలిటరి, రాజకీయపరంగా గడ్డుపరిస్ధితిని ఎదుర్కొంటూవుంది. గత సంవత్సరం చంద్రగిరి గుట్టల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వార్‌ భారీ మూల్యంచెల్లించింది. ఈ ఎన్‌కౌంటర్‌లో వార్‌ నగర కమిటీ మొత్తం తుడిచిపెట్టుకు పోయింది.

వార్‌ అత్యంత ప్రాధాన్యప్రాంతంగా పరిగణించే వరంగల్‌ జిల్లాలో పటిష్టమైన సమాచార వ్యవస్ధను ఏర్పాటు చేసుకున్న పోలీసులు ద్విముఖ దాడులను కొనసాగిస్తున్నారు.ఒకవైపు దళాలపై దాడులు చేస్తూ, మరో వైపు కార్మిక, కర్షక మేధావి వర్గాలను వార్‌కు దూరం చేసే వ్యూహం పన్నారు.

ఆర్ధిక సహాయం సైతం అందకుండా అనుమానిత వ్యాపార వర్గాలను సైతం అదుపులోకి తీసుకున్నారు.ఇటీవలి కాలంలో వార్‌ పరిణామాలపై వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ ఎస్‌.పి డాక్టర్‌ ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌తో ఇండియా ఇన్‌ఫో ప్రత్యేక ఇంటర్వూ.

ప్రశ్న: జిల్లాలో ఇటీవల పీపుల్స్‌వార్‌ ఉద్యమంలో చోటుచేసుకున్న పరిణామాలు ఏమిటి?
జవాబు: ఉద్యమ రీత్యా వరంగల్‌ జిల్లాను అత్యంత ప్రాధాన్యతగల ప్రాంతంగాపీపుల్స్‌వార్‌ పరిగణిస్తుంది.రాష్ట్రంలో మరే జిల్లాలో లేని విధంగా నగరంతోపాటు జిల్లా అంతటా వార్‌ ప్రభావం కనిపిస్తుంటుంది.అయినప్పటికీ ప్రజలు అందిస్తున్న సహకారంతో
వార్‌ను పెద్ద ఎత్తున నష్టపరిచాము. దీంతో, దళాలను ఎత్తివేసి 4,5 దళాలను కలిపి ప్రజాగెరిల్లా ఆర్మీగా రూపొందించారు.
ప్రభుత్వ విధానాలతోపాటు, పోలీసులు అనుసరిస్తున్న విధానాల పట్ల ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తున్నది.

ప్రశ్న: జిల్లాలో వార్‌ రిక్రూట్‌మెంట్‌ ఎలా వుంది?
జవాబు: నిజానికి రిక్రూట్‌మెంట్‌ తగ్గింది. కాకి లెక్కలు చెప్పి రిక్రూట్‌మెంట్‌పెరిగిందని పీపుల్స్‌వార్‌ అనవచ్చు. కానీ, గతంతో పోల్చితే రిక్రూట్‌మెంట్‌ చాలా తక్కువగావుంది. పార్టీలోకి వెళ్లినాస్వల్పవ్యవధిలోనే బయటకు వస్తున్నారు.
ఇంతకు ముందు వార్‌ నాయకత్వం పోలీసు బూచిని చూపించి పార్టీలో కొనసాగేటట్టు చేసేది.ఇప్పడా అవకాశం వార్‌కు లేదు. లొంగిపోయినవారి జీవనోపాధికి ఎంతోకొంత తోడ్పడుతున్నాము. దీంతో వార్‌ దుష్ప్రచారాన్ని నమ్మకుండాస్వచ్ఛందంగా లొంగిపోతున్నారు.

ప్రశ్న: రైతుల, ఉపాధ్యాయుల సమస్యలపట్ల, ప్రత్యేక తెలంగాణా సాధనకోసం, పౌరుల హక్కులకోసం ఉద్యమించే సంఘాలను వార్‌ అనుబంధ సంఘాలుగా మీరు ఎలా పరిగణిస్తారు?
జవాబు: రైతుల సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించినపుడు ఏనాడూ వేధించలేదు. నిజానికి రైతుల సమస్యల పేరుతో నిషిద్ధ వార్‌ కార్యక్రమాలు కొనసాగించటమే ఈ సంఘాల పని. రైతుసేవా సమితి నాయకుడు కాసర్ల రామ్‌రెడ్డి వార్‌తో తనకున్న సంబంధాల గురించి, వార్‌కి ఎలా తోడ్పడిందీ సాక్షాలతో సహా వెల్లడించాడు. తెలంగాణా జనసభ తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంకోసం ఉద్యమిస్తే, రాష్ట్ర ప్రభుత్వ విధానాలనే పోలీసులు అనుసరిస్తారు. పోలీసులకు వ్యక్తిగత విధానాలు ఉండవుకదా.వీళ్లు పోలీసు స్టేషన్ల పేల్చివేతలో, పోలీసుల కాల్చివేతలో ప్రధానపాత్ర పోషిస్తున్నారు.

డిటిఎఫ్‌ (డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌)విషయానికొస్తే ఉపాధ్యాయుల సమస్యలను గాలికొదిలి ప్రజా ప్రతినిధుల హత్యలకు రెక్కి చేయటం, వార్‌కు సహకరించటం లాంటి అంశాలకే ప్రాధాన్యతనిస్తున్నారు. ఎపిసిఎల్‌సి గురించి చెప్పాల్సిన అవసరమేలేదు. పౌరులు అంటే వీరి దృష్టిలో నక్సలైట్లే. పౌరుల హక్కుల మాట అవతలపెట్టి వార్‌ ఉత్తరాలు బట్వాడా చేసే పోస్ట్‌ మెన్‌లుగా మిగిలి తద్వారా వార్‌ హింసాత్మక కార్యక్రమాలకు సహకరిస్తున్నారు. అందుకే, ఈసంఘాల నాయకులపై చట్టపరంగా చర్య తీసుకుంటున్నాము.

ప్రశ్న: నగరంలో విస్తృత తనిఖీల పేరుతో ప్రజలను వేధిస్తున్నారన్న ఆరోపణకు మీ సమాధానం?
జవాబు: మొదట్లో ఒకరిద్దరు పోలీసులు దురుసుగా వ్యవహరిచటం గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకున్నాము. తనిఖీలవల్ల హింసాత్మక చర్యలు తగ్గాయి.దొంగలు దొరికారు.
గంజాయి తదితర మత్తు పదార్ధాలను స్వాధీనపరుచుకున్నాం. ఈవ్‌టీజింగ్‌ తగ్గింది.

ప్రశ్న: నగరంలో రౌడీయిజం అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
జావాబు: నగరంలో రౌడీలను గుర్తించి కౌన్సిలింగ్‌ ద్వారా జీవన విధానాన్ని మార్చుకునేటట్టు చేశాం. రౌడీలను హిస్మాత్మక చర్యలు చేసేవారు, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడేవారుగా గుర్తంచి తగు చర్యలు చేపట్టాము.మైత్రీ సంఘాల ద్వారా వారి సమాచారంసేకరించి, కఠిన చర్యలు తీసుకుంటున్నాము.

(చిలుముల్ల సుధాకర్‌)

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X