వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాల్పుల విరమణకుస్వస్తి-పర్వేజ్‌కు ఆహ్వానం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యఢిల్లీ : కాశ్మీర్‌లో కాల్పులవిరమణకు కేంద్ర ప్రభుత్వం స్వస్తిపలికింది. బుధవారం సాయంత్రం న్యూఢిల్లీలోసమావేశమైన భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌ కమిటి ఈమేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో కాశ్మీర్‌లో గత ఆరునెలలుగా కొనసాగుతూవున్న కాల్పుల విరమణకు తెరపడింది. ఆరునెలల క్రితం భారత ప్రభుత్వం ఏకపక్షంగా ప్రకటించిన కాల్పులవిరమణ గడువు ఈ నెల 31వ తేదీతో ముగుస్తుంది

కాశ్మీర్‌ సమస్యపై పాకిస్తాన్‌సైనిక పాలకుడు ముషరాఫ్‌తో కూడా చర్చలు జరపాలని కూడా కమిటినిర్ణయించింది. సివ్లూ ఒప్పందం, లాహోర్‌ చర్చలకుఅనుగుణంగా ముషరాఫ్‌తో చర్చలు జరపాలి కమిటినిర్ణయించింది. ఇందుకుగాను పాకిస్థాన్‌ మిలటరీ పాలకుడుపర్వేజ్‌ ముషర్రాఫ్‌ను భారత్‌కు ఆహ్వానించాలని సమావేశంనిర్ణయం తీసుకున్నట్లు రక్షణ శాఖ మంత్రిజస్వంత్‌ సింగ్‌ విలేకరులకు చెప్పారు. లాంఛనంగాముషర్రాఫ్‌కు ఆహ్వానం పంపనున్నట్లు ఆయన తెలిపారు.

కాల్పుల విరమణకు స్వస్తి చెప్పడంతో ఆరునెలల క్రితం ఆగిపోయిన గాలింపు చర్యలను భారతసైనికులు తిరిగి మొదలు పెడతారని జస్వంత్‌ సింగ్‌చెప్పారు. విదేశాలకు చెందిన తీవ్రవాదగ్రూప్‌లు, సంస్థలు శాంతి, చర్చలు, సహకారం,హింస స్వస్తి వంటి అంశాలకు సంబంధించిన ప్రాముఖ్యతనుగుర్తిస్తాయని భావించి కాల్పుల విరమణను అమలుచేశామని, ఆ దశ దాటిపోయిందని ఆయన అన్నారు.

జమ్మూ కాశ్మీర్‌లో శాంతిప్రక్రియను తీవ్రవాద గ్రూప్‌లు దెబ్బతీశాయని, ఇక ముందు భద్రతా దళాలు తమకున్యాయమైన తోచిన చర్యలకు దిగుతాయనిఆయన చెప్పారు. అయితే, పౌరులపై వేధింపులు జరగకుండా భద్రతాదళాలు జాగ్రత్త పడతాయని ఆయన అన్నారు.

కె.సి. పంత్‌ నేతృత్వంలో ప్రారంభించినచర్చల ప్రక్రియ కొనసాగుతుందని, చర్చల్లో పాలు పంచుకోవాలని ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌లోనిఅన్ని వర్గాలను ఆహ్వానిస్తోందని ఆయనచెప్పారు.

కమిటి సమావేశానికి ముందుకాశ్మీర్‌లో కాల్పుల విరమణకు సంబంధించి ప్రధానివాజ్‌పేయి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా,తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, తదితరులతో విస్తృతంగాచర్చించారు.

కాగా, కాశ్మీర్‌లొ కాల్పుల విరమణ ఒట్టి బూటకమనిహురియత్‌ కాన్ఫరెన్స్‌ దుయ్యపట్టింది. కాశ్మీర్‌సమస్యపై భారత ప్రభుత్వంతో చర్చించేందుకుముషరాఫ్‌ సిద్ధంగా ఉన్నారని నిన్ననేపాకిస్తాన్‌ నుంచి తిరిగి వచ్చిన హురియత్‌ నేతషేక్‌ హజీజ్‌ తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X