• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మంద కృష్ణ ప్రత్యేక తెలంగాణా పోరు

By Staff
|

వరంగల్‌: ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు కోసంతాము ఉద్యమం చేపట్టనున్నట్లు మహాజన సంఘర్షణ సమితినాయకుడు మంద కృష్ణ మాదిగ చెప్పారు. వరంగల్‌ జిల్లాజనగామలో జరిగిన సమితి కార్యవర్గసమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుఆయన తెలిపారు. ప్రత్యేక తెలంగాణా సాధన కోసంజూన్‌ 7వ తేదీ నుంచి వివిధ ప్రాంతాల్లో సదస్సులునిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కె.చంద్రశేఖరరావు తెలంగాణా రాష్ట్ర సమితిఆధ్వర్యంలో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడితేఅణగారిన కులాలు మరో 40 యేళ్లు బానిసత్వంలోమగ్గాల్సి వస్తుందని ఆయన అన్నారు.

చంద్రశేఖరరావు పదవీవ్యామోహంతోనే ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని చేపట్టారనిఆయన విమర్శించారు. అణగారిన కులాలను బానిసత్వంవైపు కాకుండా విముక్తి వైపు నడిపించడానికితాము ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని నడిపిస్తామనిఆయన చెప్పారు. తెలంగాణాలో ప్రాంతీయ వెనుకబాటుతనంలేదని, అగ్రకులాలవారు వెనుకబడి లేరని,అణగారిన కులాలు వెనుకబడ్డాయని ఆయన అన్నారు. గతంలో ప్రత్యేక తెలంగాణాఉద్యమాన్ని వెన్నుపోటు పొడిచింది అగ్రకులాలవారేనని ఆయన విమర్శించారు.

షెడ్యూల్‌ కులాల రిజర్వేషన్లనువర్గీకరించాలని డిమాండ్‌ చేస్తూ మంద కృష్ణమాదిగ గతంలో మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి(ఎంఆర్‌పిఎస్‌) పేరిట ఉద్యమం నడిపారు. దీన్నేమాదిగ దండోరా ఉద్యమమని అంటారు.ఇప్పుడాయన అణగారిన కులాల కోసం మహాజన సంఘర్షణ సమితిని ఏర్పాటుచేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X