ిపసిసికి పులిచింతలపోరు
విజయవాడకు చెందిన ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, మాజీ ఉపముఖ్యమంత్రి కోనేరు రంగారావు, దేవినేని నెహ్రూ తదితరులు సమావేశమై పులిచింతల విషయంలో తెలంగాణాకు చెందిన కాంగ్రెస్ నాయకుల వైఖరిపై తాము అధిష్టానవర్గానికి ఫిర్యాదు చేయనున్నట్టుగా చెప్పారు. పులిచింతల తెలంగాణాకు కూడా ప్రయోజనకరమైన ప్రాజెక్టని దీనివిషయంలో తెలంగాణా నేతలు అసత్య ప్రచారానికి దిగుతున్నారని వారు పేర్కొన్నారు.
కాగా పులిచింతల తెలంగాణా ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని నష్టపరిహారం విషయం తేల్చకుండానే ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ముందుకు కదలడం తమ ప్రాంత ప్రయోజనాలను దెబ్బతీయడమేనని కాంగ్రెస్ తెలంగాణా ఫోరం కన్వీనర్ ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. పులిచింతల వల్ల 18 గ్రామాలు మునిగిపోతాయని, 45 వేల ఎకరాలు ముంపునకు గురవుతుందని ఆయన వెల్లడించారు. శ్రీరామసాగర్ ప్రాజెక్టు పరిహారం విషయమే ఇంతవరకు తేల్చని ప్రభుత్వం పులిచింతల ప్రాజెక్టును ఏ విధంగా చేపడుతుందని ఇంద్రకరణ్‌రెడ్డి ప్రశ్నించారు.
పులిచింతల ప్రాజెక్టు పనులను అడ్డుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కాగా పిసిసిలోని రెండు ప్రధాన ప్రాంతాల ఎమ్మెల్యేలు పులిచింతలపై భిన్నవైఖరులను అవలంభించడంతో పిసిసి దిక్కుతోచని స్థితిలో పడింది. ఈ ప్రాజెక్టుపై మాట్లాడేందుకు పిసిసినేత సత్యనారాయణరావునిరాకరించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!