ముషర్రాఫ్కుహురియత్ వినతి
న్యూఢిల్లీ: కాశ్మీర్‌పై చర్చకు భారత్ పంపినఆహ్వానాన్ని మన్నించాలని ఆల్ పార్టీ హురియత్‌కాన్ఫరెన్స్ మాజీ చైర్మన్ మిర్వయిజ్ ఒమర్ ఫరూక్పాకిస్థాన్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ జనరల్ పర్వేజ్ముషర్రాఫ్కు విజ్ఞప్తి చేశారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగావున్న కాశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకుతొలి మెట్టుగా భారత్ ఆహ్వానాన్ని పరిగణించాలనిఆయన అన్నారు.
భారత ప్రధాని అటల్ బిహారీవాజ్‌పేయి ఆహ్వానాన్ని ముషర్రాఫ్ అంగీకరించి చర్చలప్రక్రియను ప్రారంభించాలని ఆయన శనివారం విలేకరులసమావేశంలో అన్నారు. కాశ్మీర్ సమస్య శాశ్వత పరిష్కారానికి అతిముఖ్యమైన మూడవ పార్టీ కాశ్మీర్ ప్రజలనుచర్చల్లో భాగస్వాములను చేయడం అవసరమనిఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర హోంమంత్రిఎల్.కె. అద్వానీ ప్రకటనకు ఆయన ప్రతిస్పందిస్తూ కాశ్మీరీలభాగస్వామ్యం లేకుండా జరిగే చర్చలు అర్థవంతం కావనిఅన్నారు.
భారత్, పాక్‌ల మధ్య సంప్రతింపులవిషయంలో మధ్యవర్తిత్వ పాత్ర పోషించేఉద్దేశం హురియత్ కాన్ఫరెన్స్‌కు లేదనిఆయన అన్నారు. వివాదం ప్రాథమిక పార్టీనే తామనిఆయన వ్యాఖ్యానించారు.
ముషర్రాఫ్ భారత్‌కు వస్తే ఇరుదేశాలు స్నేహ, శాంతి మార్గాన్ని ఎంచుకోవాల్సినఅవసరం గురించి తెలియజేస్తామని ఆయనచెప్పారు. కాశ్మీరీలు శాంతియుత వాతావరణంలో జీవించాలని కోరుకుంటున్నారని ఫరూక్చెప్పారు. కాశ్మీరు వల్ల ఒకే చరిత్ర, సంస్కృతి గల రెండుదేశాల మధ్య పొరపొచ్చాలు రావడం దురదృష్టకరమనిఆయన అన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!