వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గుజరాత్‌కు తప్పిన తుఫాను ముప్పు
అహ్మదాబాద్: గుజరాత్‌కు తుఫాను గండం తప్పినట్లే.ఆరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండంబలహీనడింది. సోమవారం సాయంత్రం వాయుగుండం తీరాన్నిదాటవచ్చునని, అయితే దీని వల్ల పెద్దగాముప్పు వుండదని అధికారులు అంటున్నారు.పోర్బందర్కు 450 కిలోమీటర్ల దూరం ఆదివారంనాడువాయుగుండం కేంద్రీకృతమై వుంది. ఇది ఉత్తరదిశగా పయనించి వెనక్కి మళ్లే క్రమంలో సోమవారంసాయంత్రం గుజరాత్ తీరాన్ని తాకుతుందని వాతావరణకార్యాలయం అధికారులు చెప్పారు.
వాయుగుండం బలహీన పడడంతో గంటకు 60నుంచి 80 కిలోమీటర్ల వేగంతో మాత్రమే గాలులువీస్తాయని వారన్నారు. అవసరమైన సహాయ చర్యలు చేపట్టడానికి రక్షణ మంత్రిత్వ శాఖఅన్ని ఏర్పాట్లు చేసింది. రక్షణ రంగం ఆస్తులకునష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
Story first published: Sunday, May 27, 2001, 23:53 [IST]