వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తానా సభల్లోసాహిత్య ప్రత్యేకతలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జూన్‌ 29, 30తేదీల్లో జరిగే 13వ నార్త్‌ అమెరికా తెలుగుఅసోసియేషన్‌ (తానా) తెలుగు సభల్లో ప్రత్యేకపద్ధతుల్లో సాహిత్య కార్యక్రమాలు వుంటాయి.తానా సభల్లో వుండే తెలుగు సాహిత్య కార్యక్రమాలను ఈ సభల్లోపాల్గొనే డాక్టర్‌ డి.ఎస్‌.యన్‌. మూర్తి ఆదివారంవిలేకరుల సమావేశంలో వివరించారు. ఆగతానికిస్వాగతం, త్రిగుణిత అష్టావధానం, సాహిత్యవేదికలు, స్వీయ కవితా వేదిక వుంటాయనిఆయన చెప్పారు. గతంలో కన్నా భిన్నంగా, ప్రత్యేకంగావుండేలా సాహిత్య కార్యక్రమాలను ఖరారు చేసినట్లుఆయన తెలిపారు.

ఆగతానికి స్వాగతం గురించి ప్రముఖ తెలుగు సాహితీవేత్తఇంద్రగంటి శ్రీకాంతశర్మ వివరించారు. వేయి ఏళ్ల తెలుగుసాహిత్య ప్రక్రియలను, అంటే నన్నయ కాలంనుంచి కందుకూరి వీరేశలింగం వరకు వచ్చినసాహిత్య ప్రక్రియలను రూపకంగా మలిచినట్లు, ఈ రూపకాన్నితానా సభల్లో ప్రదర్శించనున్నట్లు ఆయన తెలిపారు.

భువనవిజయం, కవనవిజయం లాంటి నాటకాలకు భిన్నంగా తెలుగుసాహిత్యంలోని గొప్ప కవులను, రచయితలనుముందుకు తెచ్చేలా ఈ రూపకాన్ని మలిచినట్లుఆయన తెలిపారు. ఇందులో కవిత్వ కథనాలు, డ్రామా, డ్యాన్స్‌, సంగీతంవుంటాయని ఆయన అన్నారు. ఇందులో పది మంది ప్రముఖులు పాల్గొంటారనిఆయన చెప్పారు. ఈ రూపకం గిరిజన నృత్యంతోప్రారంభమై జానపద సాహిత్యాన్ని, లిఖితసాహిత్యంలోని అన్ని ప్రక్రియలను ప్రతిబింబిస్తూ సాగుతుందనిఆయన అన్నారు.

శతావధానాలు, సహస్రవధానం చేసిన డాక్టర్‌ గరికపాటినరసింహరావు త్రిగుణిత అష్టావధానంచేస్తారు. ఇందులో భాగంగా ఆయన 24 మంది పృచ్ఛకులుఅడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ సమస్యాపూరణాలుచేస్తారు.

మూడవ విభాగంలో సాహిత్య వేదికలు వుంటాయి. పండితులు,కవులు, నటులు తమకు సంబంధించిన అంశాలపై ప్రసంగాలుచేస్తారు. నాద వేదికలో ఇంద్రగంటి జానకీబాల లలిత, చలనచిత్రసంగీతాల్లో సాహిత్య ధోరణులపైప్రసంగిస్తారు. తెలుగు పురాణ వేదకలో ఎలూరిపాటిఅనంతరామయ్య ప్రాచీన కావ్య, పురాణాల దృక్కోణాన్నివివరిస్తారు. ఆధునిక కథా వేదిక మీంచి డాక్టర్‌ పాపినేని శివశంకర్‌ తెలుగుకథానికపై మాట్లాడుతారు. పద్య నాటక సారస్వతవేదిక మీంచి జి.ఎస్‌.యన్‌. మూర్తి మ్యూజికల్‌థియేటర్‌లో గేయధోరణుల గురించి, బుర్రాసుబ్రహ్యణ్యశాస్త్రి పౌరాణిక నాటక సాహిత్యం గురించిమాట్లాడుతారు.

ఆధునిక నాటక సమీక్షావేదికలో భాగంగా సమకాలీన నాటక రచనలో విభిన్న ధోరణులపై డాక్టర్‌డి.యస్‌.యన్‌. మూర్తి ప్రసంగిస్తారు. ఆధునిక కవితావేదిక మీంచి ఇంద్రగంటి శ్రీకాంతశర్మ పద్యంనుంచి వచన పద్యం వరకు గల తెలుగుసాహిత్యం గురించి వివరిస్తారు. అమెరికాలోని తెలుగు కవులుస్వీయ కవితలను పఠించడానికి స్వీయ కవితా వేదికను ఏర్పాటుచేస్తున్నారు.

ఈ తానా సాహిత్య కార్యక్రమాల్లో ప్రముఖ సాహిత్యకారులు డాక్టర్‌నాగభైరవ కోటేశ్వరరావు, డాక్టర్‌ కె. శివారెడ్డి, డాక్టర్‌ యార్లగడ్డబాలగంగాధరరావు, వాసిరెడ్డి నవీన్‌, శారదా అశోకవర్ధన్‌పాల్గొంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X