• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రైతుల రక్షణ కేంద్రం బాధ్యత

By Staff
|

విశాఖపట్నం: ప్రపంచ వాణిజ్య సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రభావం వల్ల రైతాంగం దెబ్బతినకుండా కాపాడాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వానిదేనని తెలుగుదేశం పార్టీ స్పష్టం చేసింది. గత ప్రభుత్వాలు ముందుచూపు లేకుండా కుదుర్చుకున్న డబ్లుటివో ఒప్పందం ఇప్పటికే సమస్యల విష వలయంలో వున్న రైతుల పరిస్థితిని మరింత విషమింపజేస్తుందని మహానాడు అభిప్రాయపడింది.

మహానాడు రెండోరోజు సోమవారం నాడు దేశవ్యవసాయ రంగంపై డబ్లుటివో ఒప్పందం ప్రభావంపై తీర్మానాన్ని చర్చకు చేపట్టింది. రాష్ట్ర మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. డబ్లుటివో ఒప్పందం దేశీయ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయకుండా తగిన చర్యలు తీసుకునేలా కేంద్రంపై రాష్ట్రాలు వత్తిడి తేవాలని ఉమ్మారెడ్డి అన్నారు.

తీర్మానంపై ప్రసంగించిన మరికొందరు వక్తలు పూర్తిగా డబ్లుటివోను తప్పుపట్టడానికి లేదని కొత్త సవాళ్లకు అనుగుణంగా దేశ రైతాంగాన్ని సన్నద్ధం చేయలేకపోయిన కేంద్రం ప్రభుత్వం తప్పు కూడా ఈ విషయంలో వున్నదని వ్యాఖ్యానించారు. చౌకధరల్లో నాణ్యమైన ఉత్పత్తులను తీసుకురాగలిగితే అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీని భారత్‌ అవలీలగా ఎదుర్కోగలదని వారు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X