• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మహానాడు తీర్మానాల అమలుకు సెల్‌

By Staff
|

విశాఖపట్నం: మహానాడులో చేసిన తీర్మానాల అమలుకు అవసరమైతే సచివాలయంలోని తన కార్యాలయంలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. మహానాడులో మంగళవారం ఆయన ఈ ప్రకటన చేశారు. మహానాడు తీర్మానాల అమలుకు, సమస్యల పరిష్కారానికి ఈ సెల్‌ ద్వారా కృషి చేసి వీటి అమలును వచ్చే మహానాడులో సమీక్షిస్తామని ఆయన చెప్పారు. మూడు రోజుల పాటు జరిగిన మహానాడు సమావేశాలు మంగళవారం ముగిశాయి. కేంద్ర రాష్ట్ర సంబంధాలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, ఆర్థిక సంస్కరణల వంటి ముఖ్యమైన విషయాలపై మహానాడులో వేడిగా వాడిగా చర్చ జరిగింది.

మహానాడులో మొత్తం 42 తీర్మానాలు ఆమోదించగా, 121 అంశాలపై చర్చ జరిగింది. పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకుపోవడానికి మహానాడు కార్యకర్తలకు స్ఫూర్తినిచ్చిందని తెలుగుదేశం సీనియర్‌ నాయకులు భావించారు. దాదాపు ఐదు వేల మంది ప్రతినిధులు పాల్గొన్న ఈ మహానాడులో ప్రతి విషయంపై సమగ్రంగా చర్చ జరిగిందని, చర్చల్లో అందరూ అసక్తిగా పాల్గొన్నారని వారన్నారు.

రాష్ట్రాలకు కేంద్రం మరిన్ని అధికారాలు ఇవ్వాలని, వనరుల పంపిణీ సక్రమంగా జరగాలని, ఏవి రాష్ట్రాలకు ఇవ్వాలి, ఏవి తమ వద్ద ఉంచుకోవాలి అనే అంశంపై స్పష్టంగా కేంద్రం ఒక నిర్ణయానికి రావాలని ముఖ్యమంత్రి అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X