వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్‌ మసీదులో తుపాకుల హోరు

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: జమ్మూ కాశ్మీర్‌ దక్షిణ ప్రాంతంలోని ఖర్వార గ్రామంలోని మసీదులో దాక్కున్న తీవ్రవాదులను బయటకు రప్పించడానికి మసీదును సాయుధ బలగాలు చుట్టుముట్టడంతో ఈ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. మసీదు లోపల దాక్కున్న ముగ్గురు తీవ్రవాదులు లోపలినుంచే భద్రతాదళాలపై కాల్పులు జరుపుతున్నారు.

ఉదయం ఈ గ్రామంలో భద్రతాదళాలు గాలింపు జరుపుతుండగా ఒక ఇంట్లో దాక్కున్న తీవ్రవాదులు కాల్పులు జరిపారని, సైన్యం ఎదురుకాల్పుల్లో ఒక మిలిటెంట్‌ మరో సైనికుడు మరణించాడని పోలీసులు చెప్పారు. సైనికుల నుంచి తప్పించుకున్న ముగ్గురు తీవ్రవాదులు మసీదులోకి పారిపోవడంతో సైనికులు ఆ మసీదును చుట్టుముట్టారని వారు తెలియజేశారు. బుధవారం మధ్యాహ్నం వరకు కూడా కాల్పులు కొనసాగుతునే వున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X