వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిఆర్‌ఎస్‌లోచేరరు: విద్యాసాగరరావు

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడ: తమ పార్టీకిచెందినవారెవరూ తెలంగాణా రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌)లోచేరలేదని, చేరబోరని కేంద్ర హోంశాఖసహాయ మంత్రి చెన్నమనేని విద్యాసాగరరావుఅన్నారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కావాలనికాకినాడలో తమ పార్టీ చేసిన తీర్మానానికి తాము కట్టుబడివున్నామని ఆయన బుధవారం విలేకరులసమావేశంలో స్పష్టం చేశారు.

తమ పార్టీపై తెలంగాణా రాష్ట్ర సమితి ఏ మాత్రం ప్రభావంచూపబోదని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణావిషయంలో తమ పార్టీలో ఏ విధమైనభేదాభిప్రాయాలు లేవని ఆయన అన్నారు. ఎవరూమనస్తాపానికి గురి కావడం లేదని కూడా ఆయనఅన్నారు.

వెనుకబడిన తెలంగాణా,రాయలసీమ ప్రాంతాల్లో వ్యవసాయ పరిశ్రమలనుప్రోత్సహించాలని, ప్రాంతాల వారీగా ప్రణాళికలురూపొందించి అమలు చేయాలని ఆయన రాష్ట్రప్రభుత్వానికి సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X