• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

న్యూయార్క్‌ లోఅమీర్‌ ఖాన్‌ కలకలం

By Staff
|

న్యూయార్క్‌ఃబాలీవుడ్‌ హీరో అమీర్‌ ఖాన్‌ అకస్మాత్తుగా ఇక్కడిఒక మ్యూజిక్‌ షాపులో ప్రత్యక్షమయ్యేసరికిషాపింగ్‌ కి వచ్చిన జనం ఆయనను చుట్టుముట్టిఉక్కిరిబిక్కిరి చేశారు. జనం అలా అలా పెరిగిపోవడంతోపరిస్ధితి ట్రాఫిక్‌ జాం వరకు దారి తీసింది. ఇక్కడిజాక్సన్‌ హైట్స్‌ లోని రాగా మ్యూజిక్‌ స్టోర్‌ ఎదుటవెయ్యి మంది అమీర్‌ ఖాన్‌ ను చూడడానికిగుమికూడారు.ఈ ప్రాంతంలో భారతీయులు ముఖ్యంగాదక్షిణాసియా వారు ఎక్కువగా నివసిస్తున్నారు.జనం అలా ఒక్కసారిగా అమీర్‌ ఖాన్‌ ను చూడడానికిగుమికూడడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసిట్రాఫిక్‌ ను చక్కదిద్దారు. తన సొంత సినిమాలాగాన్‌ షూటింగ్‌ కోసం అమీర్‌ ఖాన్‌ అమెరికా వచ్చాడు.

పాతిక కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్నఈ చిత్రం 1893 నాటి చారిత్రక గాధ ఆధారంగా రూపొందింది.అధిక పన్నులకు నిరసనగా భారత్‌ లోని ఒకపల్లెటూరు బ్రిటీషు పాలకుల మీద తిరుగుబాటుచేయడం ఈ కథలోని ప్రధానాంశం. ఇందుకోసంగుజరాత్‌ లోని భుజ్‌ లో ఏకంగా ఒక గ్రామాన్నే సెట్‌లుగా రూపొందించారు. సోనీ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ద్వారాప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న ఈ చిత్రాన్నిఒక్క అమెరికాలోనే 40 థియేటర్లలో ప్రదర్శించబోతున్నారు.ఈ చిత్రం కథ తనకు స్ఫూర్తి నిచ్చిందని, ఇతరనిర్మాతల చేతుల్లో ఈ కథకు న్యాయం చేకూరదనిభావించి తానే నిర్మాతగా మారానని అమీర్‌ ఖాన్‌చెప్పాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X