వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రికెట్‌పై వాజ్‌ పేయితో ముష్రాఫ్‌ చర్చ

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌: కాశ్మీర్‌పై చర్చల కోసం ఢిల్లీ వస్తున్న పాకిస్తాన్‌సైనిక పాలకుడు జనలర్‌ పర్వేజ్‌ ముష్రాఫ్‌ భారత్‌- పాక్‌ క్రికెట్‌ సంబంధాలపై కూడా చర్చిస్తారని పాకిస్తాన్‌ క్రీడా శాఖా మంత్రి ఎస్‌.కె.త్రిస్‌లర్‌ తెలిపారు.

చర్చల్లో కాశ్మీరే ప్రధానాంశమయినప్పటికీ, క్రికెట్‌ సంబంధాలపై కూడా ముష్రాఫ్‌ చర్చిస్తారని బుధవారం రాత్రి ఆయన ఇస్లామాబాద్‌లోపేర్కొన్నారు.ఆసియా టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో భాగంగాసెప్టంబర్‌లో పాకిస్తాన్‌లో జరగాల్సిన భారత్‌- పాక్‌టెస్ట్‌మ్యాచ్‌ ఇప్పడు తక్షణ సమస్యఅని ఆయన అన్నారు.

పన్నెండు సంవత్సరాల అనంతరం పాకిస్తాన్‌తో ఆడేందుకు భారత క్రికెట్‌ బోర్డుఅంగీకరించింది. ఇటీవల లాహోర్‌లో జరిగిన ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ సమావేశంలో భారత క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు ముత్తయ్య ఈ మేరకు రాతపూర్వకంగాఅంగీకారం తెలిపారు. అయితే భారత క్రీడా శాఖా మంత్రి ఇందుకు అభ్యంతరం తెలిపారు. ఈనేపద్యంలో చర్చల నిమిత్తం భారత్‌కు వస్తున్న ముష్రాఫ్‌ పనిలో పనిగా క్రికెట్‌వివాదాన్ని గూడా చర్చించాలని నిర్ణయించుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X