జయ ఆరోపణలై మండిపడ్డ ఆంధ్ర
తమిళనాడుకు కృష్ణా జలాలను తరలిస్తునేవున్నాం
హైదరాబాద్ః మద్రాసుకు కృష్ణా జలాలలను తరలిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మోసం చేశారంటూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చేసిన ఆరోపణను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఖండించింది. ఒప్పందానికి అనుగుణంగా కృష్ణా జలాలను తమిళనాడుకు తరలిస్తునే వున్నామని రాష్ట్ర నీటిపారుదల శాఖ శనివారం స్పష్టం చేసింది. తెలుగుగంగ ప్రధాన కాలువ నిర్మాణం పూర్తి కాకపోవడంతో చిన్న కాలువల ద్వారా తమిళనాడుకు కృష్ణా జలాలను తరలిస్తునే వున్నామని ఆంధ్ర అధికారులు స్పష్టం చేశారు.
ఆంధ్ర నుంచి వాననీళ్ళు చెన్నయ్ కి చేరుకుంటున్నప్పటికీ, వాటిని కృష్ణా జలాలుగా చెప్పి కరుణానిధి, చంద్రబాబు నాయుడు తమిళ ప్రజలను మోసం చేశారంటూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత శుక్రవారంఅసెంబ్లీలో సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేసినవిషయం విదితమే. ఈ వ్యాఖ్యలపై ఆంధ్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఒప్పందానికి అనుగుణంగానే జలాలను చెన్నయ్ కి తరలిస్తున్నామని తేల్చి చెప్పింది. నిజానిజాలు తెలుసుకోకుండా తమిళనాడు ప్రభుత్వం ఇలా వ్యాఖ్యానించడం దురృష్టకరమని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ స్పందనపై జయలలిత ఏం వ్యాఖ్యానిస్తారో వేచి చూడాలి.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!