వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ెనపాల్‌ ఆఖరు సామ్రాట్టు

By Staff
|
Google Oneindia TeluguNews

ఖాట్మండు: మహరాజు మహేంద్ర వారసునిగా భువనేంద్ర మనుమనిగా నేపాల్‌ రాజ్యాధికారం చేపట్టిన మహరాజ బీరేంద్ర బీర్‌ బిక్రమ్‌ షా దేవ్‌ 1972 నుంచి 1990 వరకు నేపాల్‌ను పాలించారు. ఆ తర్వాత ప్రజాస్వామ్య విధానం ప్రవేశించడంతో ఆయన పాత్ర రాజ్యాంగ పరంగా నామమాత్రంగా మారింది.

నేపాల్‌ను సర్వాధికారాలతో పాలించిన రాజుల్లో ఆయనే ఆఖరువారు. రాణి ఐశ్వర్యతో ఆయన వివాహం 1970లో జరిగింది. ఈ మారణకాండలో బీరేంద్ర కుటుంబం అంతా అంతం కావడంతో రాజ కుటుంబంలో ఇప్పుడు బీరేంద్ర సోదరుడు జ్ఞానేంద్ర ఆయన సోదరి మిగిలారు.భారత్‌తో సన్నిహిత స్నేహసంబంధాలనే ఎప్పుడూ కాంక్షించిన బీరేంద్ర 1945 డిసెంబర్‌ 28న జన్మించారు. డార్జిలింగ్‌లోని సెయింట్‌ జోసఫ్‌ స్కూల్లో ఆ తర్వాత లండన్‌లో ఆయన విద్యాభ్యాసం సాగింది. జపాన్‌లో, అమెరికాలో కూడా ఉన్నత చదువులు చదివారు.

సార్క్‌ నిర్మాణంలో ఆయన కీలకపాత్ర పోషించారు. 1979 వరకు పార్టీ రహిత రాజకీయ వ్యవస్థను కొనసాగించిన బీరేంద్ర ఆ తర్వాత వచ్చిన సంక్షోభం వల్ల రిఫెరండం జరిపించారు. ఈ రిఫరెండం తర్వాత పార్లమెంట్‌కు నేరుగా ఎన్నికలు జరిపే పద్దతిని ఆయన ప్రవేశపెట్టారు. పార్టీ రహిత ప్రాతిపదికనే జరిగినప్పటికీ ఈ ఎన్నికలతోనే రాజకీయ పార్టీల ఆవిర్భావం జరిగింది. నేపాల్‌లో రాజకీయ సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆయన చొరవతేనే 1990 నాటికి నేపాల్‌లో బహుళపార్టీ విధానం అమల్లోకి రావడంతో పాటు రాజు నామమాత్రునిగా మారారు.
బీరేంద్ర భార్య ఐశ్వర్య 1949 నవంబర్‌ 7న జన్మించారు. ఆమె తండ్రి నేపాల్‌ సైన్యంలో ఉన్నతాధికారి. ఆమె ఇండియాలోనూ, నేపాల్‌లోను చదువుకున్నారు. నేపాల్‌లో మహిళ స్థితిగతులను మెరుగుపర్చేందుకు వారికి అవకాశాలు కల్పించేందుకు ఆమె ఎంతో కృషి చేశారు. మహిళల అభ్యున్నితి కి చేస్తున్న కృషికి గానూ అనేక అంతర్జాతీయ అవార్డులు ఆమెను వరించాయి.

ప్రపంచదేశాల దిగ్భ్రాంతి
నేపాల్‌లో కోయిరాల ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో వున్న సమయంలో రాజదంపతుల హత్య జరగింది. ఈ హత్యకాండ పట్ల ప్రపంచదేశాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. ఐక్య రాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ కోఫీ అన్నన్‌ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సంక్షోభ సమయంలో సంయమనంతో వ్యవహరించాలని నేపాల్‌ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

  • భారత్‌దిగ్భ్రాంతి-మూడురోజుల సంతాపం
  • తండ్రిని చంపిన దీపేంద్రుడే నేపాల్‌ రాజు
  • వైద్యపరంగా మరణించిన దీపేంద్ర!
  • రాజకుటుంబాన్ని బలిగొన్న ప్రేమ
  • నేపాల్‌ రాజ దంపతుల హత్య
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X