వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేపాల్‌ రాజదంపతుల హత్య

By Staff
|
Google Oneindia TeluguNews

ఖాట్మండు: నేపాల్‌ మహరాజు బీరేంద్ర ఆయన అర్ధాంగి రాణి ఐశ్వర్యను మరో ఎనిమిది మంది రాజకుటుంబికులను రాజదంపతుల కన్నకొడుకు రాకుమారుడు దీపేంద్ర కాల్చిచంపారు.

ఈ హత్యలతర్వాత దీపేంద్ర తనను తాను కణతపై తుపాకీతో కాల్చుకున్నాడు. ఈ దారుణ సంఘటన నారాయణ్‌ హితి రాజప్రాసాదంలోనే జరిగింది. దీపేంద్ర పెళ్లికి సంబంధించిన వ్యవహారం ఈ హత్యాకాండకు కారణమని తెలిసింది. రాత్రి రాజ కుటుంబంలోని 17 మంది సభ్యులు భోజనాలకు కూచున్న సమయంలో దీపేంద్ర పెళ్లి వ్యవహారం చర్చకు వచ్చిందని, తనకు నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకుంటానని దీపేంద్ర ప్రకటించారని ఈ విషయంలో రాణి ఐశ్వర్య అభ్యంతరాలను వ్యక్తం చేయడంతో రెచ్చిపోయిన దీపేంద్ర తన గదిలోకి వెళ్లిపోయి తిరిగి తుపాకీతో వచ్చి విచక్షణరహితంగా కాల్పులు జరిపాడని తెలిసింది.

మృతుల్లో రాజదంపతులతో పాటు దీపేంద్ర తోబుట్టువులు ప్రిన్స్‌ నిరంజన్‌ (22), ప్రిన్సెస్‌ శృతి (25) బీరేంద్ర చెల్లెళ్లు శారద, శాంత, అత్తగారు రత్న, బావ కుమార ఖడ్గతో సహా మొత్తం 11 మంది వున్నారు. ప్రపంచ రాజవంశాల చరిత్రలో రాజప్రాసాదం ఇంత రక్తసిక్తమైన ఘట్టం లేదు. తన కుటుంబ సభ్యులను పొట్టనబెట్టుకున్న తర్వాత దీపేంద్ర కూడా అదే తుపాకీతో తనను తాను కాల్చుకున్నారు. ఈ దారుణ హత్యాకాండతో దిగ్భ్రాంతి చెందిన రాజప్రాసాదం సిబ్బంది వెంటనే అందరినీ ఆర్మీ ఆస్పత్రికి తరలించింది.

రాజదంపతులు మరణించినట్టుగా డాక్టర్లు ధృవీకరించారు. కాగా దీపేంద్ర మాత్రం ప్రాణాపాయ స్థితిలో వున్నారు. శనివారం మధ్యాహ్నం కోమాలో వున్న దీపేంద్రను రక్షించడానికి లైఫ్‌ సపోర్టింగ్‌ సిస్టమ్స్‌తో డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు. కాగా దీపేంద్ర తన మొత్తం కుటుంబాన్ని తుడిచిపెట్టినప్పటికీ శనివారం నాడు అత్యవసర సమావేశమైన రాజపరిషత్‌ బీరేంద్ర వారసునిగా ఆయన్నే ప్రకటించింది.

హంతకుడైనప్పటికీ దీపేంద్రను కొత్తరాజుగా ప్రకటించిన పరిషత్‌, ఆయన ఆరోగ్యం బాగయ్యేవరకు బీరేంద్ర సోదరుడు జ్ఞానేంద్ర తాత్కాలికంగా రాజ్య భారం మోస్తారని ప్రకటించింది.
తాను కోరుకున్న యువతిని వివాహం చేసుకోవడానికి తల్లితండ్రులు నిరాకరించడంతో రాకుమారుడు ఉన్మాదంతో ప్రవర్తించినట్టుగా తెలిసింది. రాజవంశానికి బద్ద శత్రువులైన రాణాల సంతతికి చెందిన యువతిని రాకుమారుడు దీపేంద్ర ప్రేమించినట్టుగా చెబుతున్నారు. అయితే ఈ కథకు సంబంధించిన వివరాలు బయటకు రాలేదు..

  • భారత్‌దిగ్భ్రాంతి-మూడురోజుల సంతాపం
  • తండ్రిని చంపిన దీపేంద్రుడే నేపాల్‌ రాజు
  • వైద్యపరంగా మరణించిన దీపేంద్ర!
  • ెనపాల్‌ ఆఖరు సామ్రాట్టు
  • రాజకుటుంబాన్ని బలిగొన్న ప్రేమ
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X