తెలంగానంకు బిజెపి దూరం
హైదరాబాద్: ఆదివారం నాడు హైదరాబాద్లో జరిగిన భారతీయ జనతాపార్టీ పదాధికారుల సమావేశం పార్టీలోని తెలంగాణా వాదులపట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. బిజెపిలోని తెలంగాణా వాదులు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న పదాధికారుల సమావేశం చివరికి వారికి నిరాశనేమిగిల్చింది. తెలంగాణా విషయమై తాము ఏ ఒక్కరితో కలిసి ఉద్యమించే ప్రసక్తేలేదని సమావేశం తేల్చిచెప్పింది. బిజెపిలో వుంటూ తెలంగాణా రాష్ట్ర సమితిలో కలిసి ఉద్యమించటం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించటమేనని సమావేశం స్పష్టం చేసింది. ప్రత్యేక తెలంగాణాపై కేంద్ర కమిటీ నిర్ణయానికి రాష్ట్ర కమిటీ కట్టుబడి వుండాలని సమావేశం నిర్ణయించింది.
స్ధానిక సంస్ధల ఎన్నికలలో తమకు స్వతంత్రంగా పోటీ చేసే శక్తివున్నదని సమావేశం అభిప్రాయపడింది.స్వతంత్రగా పోటీ చేసయినా రాష్ట్రంలో తమ ఉనికి చాటుకోగలమని, అయితే త్వరలోవిశాఖలో జరిగే పార్టీ సమావేశంలో స్ధానిక సంస్ధలలో పొత్తలపై ఒక నిర్ణయం తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!