వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిన్న రాష్ట్రాలతోచిక్కులు: సిపిఎం

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: చిన్న రాష్ట్రాల ఏర్పాటువల్ల అనవసరమైన అనేక సమస్యలుతలెత్తుతాయని లోక్‌సభలో సిపిఎం ఉపనాయకుడువాసుదేవ ఆచార్య అన్నారు. మూడు కొత్త రాష్ట్రాల ఏర్పాటువల్లనే తెలంగాణా, విదర్భ రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్‌ముందుకు వచ్చిందని ఆయన సోమవారంనాడిక్కడవిలేకరుల సమావేశంలో అన్నారు. చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేసుకుంటూ పోతే ప్రతి జిల్లా ఒక రాష్ట్రంగా ఏర్పడే పరిస్థితివస్తుందని, ఇది మంచిది కాదని ఆయన అన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటువల్ల జాతీయ సమగ్రత దెబ్బ తింటుందనిఆయన అభిప్రాయపడ్డారు.

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో సిపిఎంఅక్రమాలకు పాల్పడిందంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మమత బెనర్జీ చేసినవిమర్శలను ఆయన ఖండించారు. మమతబెజర్జీపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. సిపిఎంకాంగ్రెస్‌తో కుమ్మక్కయిందనే తృణమూల్‌ విమర్శలో ఏ మాత్రంనిజం లేదని ఆయన అన్నారు. తమ పార్టీ పాలననుమెచ్చే పశ్చిమ బెంగాల్‌ ప్రజలకు తిరిగి తమను గెలిపించారనిఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ఫలితాలు వెలువడడం ప్రారంభంకాగానే ఓటమి తప్పదని గ్రహించి మమతా బెనర్జీ తమపైవిమర్శలకు దిగారని ఆయన అన్నారు. అంతకు ముందు ఎన్నికలఅక్రమాలపై గానీ, బూత్‌ల ఆక్రమణపై గానీ మమత బెనర్జీ ఒక్కమాట కూడా మాట్లాడకపోవడాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X