వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేదరికం పోయే వరకు జన్మభూమిః బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరుః ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా రాష్ట్రంలోపేదరికం, నిరక్షరాస్యత నిర్మూలించే వరకు జన్మభూమి కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలలో పర్యటించారు. గుంటూరు జిల్లా శావల్యాపురం మతుకుపల్లిలో జరిగిన గ్రామసభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా నిరంతరం ప్రజల ముందుకు ప్రభుత్వం వెళ్ళేఏకైక కార్యక్రమం జన్మభూమి అని ఆయన అన్నారు. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో సమర్థులైన నేతలను ఎన్నుకొని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

జన్మభూమిపై రాజకీయంతగదుః బాబు
ఏలూరుః రాష్ట్ర వ్యాప్తంగా మహిళా జన్మభూమికి ఆంధ్ర ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కేవలం స్థానిక రాజకీయాల కారణంగా జన్మభూమిలో అక్కడక్కడా అపశృతులు వినిపిస్తున్నాయని ఆయన సోమవారం పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పెలికిచర్లలో జరిగిన గ్రామసభలో చెప్పారు.

నీరు-మీరు కార్యక్రమాన్ని ఇకమీదట నిరంతరాయంగా చేపట్టనున్నట్లు చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు. నాలుగోవిడత నీరు-మీరు కార్యక్రమంలో చెట్లపెంపకానికి ప్రాధాన్యత నిస్తామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా సుమారు రెండు గంటల సేపు జరిగిన గ్రామసభలో ముఖ్యమంత్రి స్థానిక ప్రజలతో కులాసాగా మాట్లాడారు. బాలురకు పలకాబలపాలు, వైద్య సిబ్బందికి కిట్స్‌ అందజేశారు. పది, ఏడో తరగతులలో ప్రతిభ కనబరచిన స్థానిక విద్యార్థులకు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రశంసా పత్రాలు అందజేశారు.

మహిళా జన్మభూమి అయినప్పటికీ అందుకు సంబంధించిన కార్యక్రమాలేవీ చంద్రబాబు సభలో ప్రస్తావనకు రాకపోవడం విశేషం. విద్యార్థులను పిలిచి వారి చదువుల గురించి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలను వారి సమస్యల గురించి అడిగారు. వారి సమస్యలపై తక్షణం చర్యలు తీసుకోవలసిందిగా అధికారులను ఆదేశించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X