వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిజంకోసం వీధులకెక్కిన నేపాల్‌ ప్రజలు

By Staff
|
Google Oneindia TeluguNews

ఖాట్మండూః తండ్రిలా భావించే రాజు బీరేంద్ర కుటుంబం యావత్తుమిస్టరీగా హత్యకు గురికావడంతో నిన్నటి వరకు లోలోన రగిలిన నేపాల్‌ ప్రజలు సోమవారం వీధులకెక్కారు.

రాజుగా జ్ఞానేంద్ర మాకొద్దు.... నిజాన్ని దాస్తున్న ప్రధాని గిరిజా ప్రసాద్‌ కొయిరాలా గద్దె దిగాలి..... జ్ఞానేంద్ర కొడుకు, యువరాజు పరస్‌ షా దేశం విడిచివెళ్ళాలంటూ వేలాది మంది యువకులు ఖాట్మండూలో సోమవారం ప్రదర్శనలు నిర్వహించారు. బీరేంద్ర మరణంతో తండ్రి మరణించినట్లుగా భావించన నేపాల్‌ యువకులు గుండ్లు గీయించుకొని ఆయన పట్ల తమకు గల అభిమాన్ని చాటుకున్నారు.పెనుకుట్రకు బీరేంద్ర బలయ్యారనే అనుమానంతో నేపాల్‌ యువకులు ఇప్పుడు రుద్రులౌతున్నారు.

బీరేంద్ర తనయుడు దీపేంద్ర మరణించాడంటూ సోమవారం వెలువడిన అధికారిక ప్రకటనతో నేపాల్‌ ప్రజలు మరింత రెచ్చిపోయారు. రాజప్రాసాదం రక్తసిక్తం కావడం వెనుక ఏదోపెద్ద కుట్ర వున్నదని నేపాల్‌ ప్రజలు గట్టిగా అనుమానిస్తున్నారు. శుక్రవారం రాత్రి రాజకుటుంబం మరణం తరువాత ఒకటొకటిగా జరుగుతున్న పరిణామాలు ప్రజలను మరింత అయోమయంలోకి నెట్టాయి.
దీపేంద్ర మరణించాడని, జ్ఞానేంద్రే ఇక నేపాల్‌ రాజు అనే వాస్తవాన్ని నేపాల్‌ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు.అసలు నిజాన్ని ప్రజలకు చెప్పకుండా దాస్తున్న నేపాల్‌ ప్రధాని గిరిజాప్రసాద్‌ కొయిరాలా ప్రభుత్వంపై కుడా ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు.
ఖాట్మండూలోనే కాకుండా నేపాల్‌ లోని పలు పట్టణాలలో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.

నేపాల్‌ ప్రభుత్వం రాజకుటుంబం హత్య వెనుకమిస్టరీని బట్టబయలు చేయకపోతే ఈ ఉద్యమాలు వీధిపోరాటాల వరకు వచ్చే ప్రమాదం వుందని పరిశీలకులు భావిస్తున్నారు. జ్ఞానేంద్రను రాజుగాఅంగీకరించేందుకు నేపాల్‌ ప్రజలు ససేమిరా అంటున్నారు. నేరచరిత్ర కలిగిన జ్ఞానేంద్ర కొడుకు పరస్‌ ను యువరాజుగాఅంగీకరించే ప్రసక్తి లేదని ప్రజలు నినదిస్తున్నారు. ఎన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజలలో వెల్లువెత్తుతున్న ఆగ్రహజ్వాలలను చల్లార్చడం కొయిరాలా ప్రభుత్వానికి అసాధ్యంగామారింది.

  • ప్రమాదవశాత్తు రాజకుటుంబంమృతి!
  • దీపేంద్ర మృతి- రాజుగా జ్ఞానేంద్ర
  • నిజంకోసం వీధులకెక్కిననేపాల్‌ ప్రజలు
  • భారత్‌దిగ్భ్రాంతి-మూడురోజుల సంతాపం
  • తండ్రిని చంపిన దీపేంద్రుడే నేపాల్‌ రాజు
  • ెనపాల్‌ ఆఖరు సామ్రాట్టు
  • రాజకుటుంబాన్ని బలిగొన్న ప్రేమ
  • నేపాల్‌ రాజ దంపతుల హత్య
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X