వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీవ్రవాదసంస్థల రద్దుకు జయ డిమాండ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః తీవ్రవాద సంస్థలను రద్దు చేయాల్సిందిగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రధాని వాజ్‌పేయికి విజ్ఞప్తి చేశారు. జయలలిత మంగళవారం ఉదయం ప్రధాని వాజ్‌పేయిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఇద్దరు నేతలుఅరగంటకు పైగా చర్చలు జరిపారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఢిల్లీ రావడం, వాజ్‌పేయిని కలుసుకోవడం ఇదే ప్రథమం.

తాను ముఖ్యమంత్రి కావడంపై దాఖలైన పిటిషన్లు కోర్టులోనే పరిష్కారం అవుతాయని జయలలిత అన్నారు. తనకు తమిళ ప్రజలు బ్రహ్మరథం పట్టారని, వారి అండే తనకు కొండంత బలమని ఆమె చెప్పారు. కావేరీ జలవివాదంపై సత్వర చర్యలు తీసుకోవాల్సిందిగా ఆమె ప్రధానినికోరారు. వివిధ డిమాండ్లతో కూడిని ఒక మెమోరాండం ను జయలలిత ప్రధానికి సమర్పించారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిపై సర్కారియా కమిషన్‌ చేసిన అవినీతి ఆరోపణల గురించి జయలలిత వాజ్‌పేయితో చర్చించి వుండవచ్చునని భావిస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో జయలలిత వెంట ఆమె మంత్రి వర్గ సహచరులు వున్నప్పటికీ వాజ్‌పేయితో జయలలిత ఒక్కరే సమావేశమయ్యారు. ఎమ్మెల్ల్యేగా పోటీచేసేందుకు జయను ఎన్నికల కమిషన్‌ అనర్హురాలిగా ప్రకటించడా, ఎఐఎడిఎంకె ఘనవిజయం సాధించడంతో జయలలిత ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆమె ముఖ్యమంత్రి కావడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో, చెన్నయ్‌ హైకోర్టులో కేసులు దాఖలయ్యాయి. ఈ నేపధ్యంలో జయలలిత ప్రధాని వాజ్‌పేయితో జరిపిన సమావేశం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నది.

రాష్ట్రపతి కె.ఆర్‌. నారాణయన్‌ ను కూడా జయలలిత కలుసుకున్నారు. అనంతరం ఆమె కేంద్ర హోం శాఖ మంత్రి అద్వానీని కలుసుకున్నారు. తమిళనాడులో విఛ్ఛిన్నకర కార్యకలాపాలకు పాల్పడుతున్న సంస్థలను రద్దు చేయాలని ఆమె అద్వానీనికోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X