రాజకుటుంబాన్ని చంపింది దీపేంద్రె
ఖాట్మండూః నేపాల్ రాజకుటుంబం హత్యా కాండ వ్యవహారం బుధవారం కొత్త మలుపు తిరిగింది. బీరేంద్ర తనయుడు దీపేంద్ర రాజకుటుంబాన్ని కాల్చి చంపాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రస్తుత రాజు జ్ఞానేంద్ర తనయుడు పరస్ తో పాటు భోజనాల గదిలోకి వచ్చిన దీపేంద్ర తల్లిదండ్రులతో గొడపడ్డాడని, వెంటనే ఆటోమేటిక్ గన్ తీసుకొని మొదట తండ్రిని, ఆ తరువాత తల్లిని, సోదరుడు, సోదరిని కాల్చి చంపాడని ప్రత్యక్ష సాక్షులు వివరించారు.
15 నిమిషాల పాటు హత్యాకాండ సాగించిన దీపేంద్ర ఆ తరువాత అక్కడే వున్న బుద్ధ విగ్రహం ముందుకు వెళ్ళి తనూ కాల్చుకు చనిపోయాడని వారు చెప్పారు. బీరేంద్ర ఆయన కుటుంబ సభ్యుల హత్యాకాండ సమయంలో అక్కడ వుండి, ప్రాణాలతో బయటపడ్డ 12 మంది ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. వారిలో కొందరు బుధవారం నోరువిప్పారు.
దీపేంద్రం తల్లిదండ్రులతో పాటు కుటుంబం మొత్తాన్ని దారుణంగా హత్య చేశారని వారు స్పష్టం చేశారు.ఇదే విషయాన్ని తొలుత ప్రకటించిన నేపాల్ ప్రభుత్వం ఆ తరువాత ఎందుకు మాట మార్చింది..... దీపేంద్ర వీపులో బుల్లెట్లు వుండడానికి గల కారణం ఏమిటి? ఇంత దారుణం జరుగుతుంటే జ్ఞానేంద్ర కుమారుడు పరస్ ఏం చేస్తున్నాడనే విషయాలు ఇంకా అస్పష్టంగానే వున్నాయి.
- ప్రమాదవశాత్తు రాజకుటుంబం మృతి!
- భారత్‌దిగ్భ్రాంతి-మూడురోజుల సంతాపం
- తండ్రిని చంపిన దీపేంద్రుడే నేపాల్ రాజు
- ెనపాల్ ఆఖరు సామ్రాట్టు
- రాజకుటుంబాన్ని బలిగొన్న ప్రేమ
- నేపాల్ రాజ దంపతుల హత్య
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!