వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముషారఫ్‌ వైఖరి భేష్‌ః వాజ్‌పేయి

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబయ్‌ః పాక్‌ మతపెద్దల వైఖరిని తప్పుపడుతూ పాకిస్తాన్‌ సైనికాధ్యక్షుడు జనరల్‌పర్వేజ్‌ ముషారఫ్‌ చేసిన వ్యాఖల పట్ల భారత ప్రధాని వాజ్‌పేయి హర్షం వ్యక్తం చేశారు. ముషారాఫ్‌ ప్రసంగాన్ని కొంతవరకువిన్నానని, ఆయన వ్యాఖ్యలు భారత్‌ పట్ల సానుకూల వైఖరిని ధ్వనిస్తున్నాయని వాజ్‌పేయి బుధవారం ముంబయ్‌ లో విలేకరుల సమావేశంలో చెప్పారు. పాక్‌ అధ్యక్షుడు ఇంతగా సానుకూల వైఖరిని ప్రదర్శించడం ఇదే ప్రధమమని వాజ్‌పేయి అన్నారు.

మోకాలికి శస్త్రచికిత్స చేసుకొనేందుకు ముంబయ్‌ చేరుకున్న ప్రధానికి మహారాష్ట్ర గవర్నర్‌ అలగ్జాండర్‌, ముఖ్యమంత్రిబిలాస్‌ రావ్‌ దేశ్‌ ముఖ్‌ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అనంతరం ప్రధానివిలేకరులతో మాట్లాడారు. భారత్‌-పాక్‌ ల మధ్య సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగేందుకు ముషారఫ్‌ వ్యాఖ్యలు తోడ్పడతాయని ఆయన అన్నారు. నియంత్రణ రేఖ గురించిన వ్యవహారాలు భారత్‌ - పాక్‌ చర్చలలో చోటు చేసుకోవని వాజ్‌పేయి సూచనప్రాయంగా తెలిపారు.

7న ప్రధాని మోకాలికి ఆపరేషన్‌
గురువారం నాడు ప్రధాని కుడిమోకాలికి శస్త్ర చికిత్స జరుగుతుంది. అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థొపిడిషియన్‌ చిత్తరంజన్‌ రాణవత్‌ బుధవారం సాయంత్రం బ్రీచ్‌ కాండి ఆస్పత్రిలోప్రధానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. రాణావత్‌ బృందం ప్రధానికి గురువారం ఉదయం ఆపరేషన్‌ నిర్వహిస్తుంది. సుమారుఅరగంటసేపు ప్రధాని మోకాలికి శస్త్ర చికిత్స జరుగుతుందని భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X