వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేదలకోసం సింప్యూటర్లు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ; పిసిలకు కారుచౌక ప్రత్యామ్నాయంగా చెబుతున్న సరికొత్త ప్రాడక్ట్‌ సింప్యూటర్లను మార్కెట్‌లోకి తెచ్చే సన్నాహాల్లో కేంద్రం వుంది. అక్షరజ్ఞానం లేకున్నా హాయిగా ఐటినుంచి లబ్దిపొందే అవకాశం సింప్యూటర్‌వల్ల పేదలకు, నిరక్షరాస్యులైన గ్రామీణులకు కలుగుతుందని కేంద్రం అంటున్నది.

లాభాపేక్ష లేని ఒక ట్రస్ట్‌ ఈ సింప్యూటర్లను ఉత్పత్తి చేసి ప్రజలకు
అందుబాటులోకి తెస్తుందని మంత్రి చెబుతున్నారు. కేవలం భారత్‌ కోసమే కాకుండా వర్ధమాన, నిరుపేద దేశాలన్నింటికీ ఈ సింప్యూటర్‌ టెక్నాలజీని అందజేయాలని భారత్‌ నిర్ణయించింది. పెద్దఎత్తున ఉత్పత్తి చేస్తే ఈ సింప్యూటర్‌ను 9 వేల రూపాయల లోపు ధరకే అమ్మవచ్చని ప్రభుత్వం చెబుతున్నది. యూజర్‌ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌ పీచర్లున్న ఈ సింప్యూటర్లను గ్రామ పంచాయతీల్లో, గ్రామీణ పాఠశాలల్లో వినియోగించడం ద్వారా ఐటిని మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించడానికి అవకాశం ఏర్పడుతుంది.

  • పెరిగిన సత్యం బ్రాండ్‌ విలువ
  • కారుచౌక రేట్లతో ఎంటిఎన్‌ఎల్‌ సెల్‌
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X