వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లేబర్‌ పార్టీ ఘన విజయం

By Staff
|
Google Oneindia TeluguNews

లండన్‌: బ్రిటన్‌లో లేబర్‌ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చింది. ప్రధాని టోనీ బ్లెయిర్‌ నాయకత్వంలో సార్వత్రిక ఎన్నికల్లో లేబర్‌పార్టీ విజయదుందుభి మోగించింది.

హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లోని 659 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో లేబర్‌ పార్టీ 395 స్థానాలను కైవసం చేసుకున్నారు. కాగా టోరీలకు120, లిబరల్‌ డెమొక్రట్లకు 38 స్థానాలు లభించాయి. గత వందేళ్ల బ్రిటన్‌ చరిత్రలో తమ పార్టీ వరసగా రెండు సార్లు అధికారం కైవసం చేసుకోవడం ఇదే ప్రధమమని టోనీ బ్లెయిర్‌ ప్రకటించారు. ఈ విజయం కోసమే తాము ఇంతకాలం శ్రమించామని ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ఆయన చెప్పారు.

బ్లెయిర్‌తోపాటు లేబర్‌ పార్టీకి చెందిన ముఖ్యులు ఆయన మంత్రి వర్గ సహచరులు కూడా ఈ ఎన్నికల్లో అనాయసంగా విజయం సాధించారు. ఎన్నికలకు ముందు జరిగిన అన్ని సర్వేల్లోనూ పోలింగ్‌ ఏకపక్షంగా సాగడం ఖాయమని బ్లెయిర్‌ విజయం తథ్యమని తేలడంతో ఫలితాలను బ్రిటన్‌ ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X