• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పంచాయతీ పైఫుల్‌బెంచ్‌ విచారణ

By Staff
|
హైదరాబాద్‌:పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూగతంలో దాఖలైన నాలుగు రిట్‌ పిటిషన్లపైహైకోర్టు విస్తృత ధర్మాసనం ఈ నెల 12న విచారణచేపడుతుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిజస్టిస్‌ సత్యవ్రత్‌ సిన్హా, జస్టిస్‌ వివిఎస్‌ రావుతోకూడిన డివిజన్‌ బెంచ్‌ ఈ పిటిషన్లనుఫుల్‌బెంచ్‌కు గురువారం నాడు నివేదించింది.

73వ రాజ్యాంగసవరణ ప్రకారం స్థానిక సంస్థలకు అధికారాలనుబదిలీ చేసే వరకు పంచాయతీ ఎన్నికలనునిర్వహించరాదని కోరుతూ హైకోర్టులో రిట్‌పిటిషన్‌ దాఖలైంది. పంచాయతీ ఎన్నికలకోసం వెనుకబడిన తరగతుల ఓటర్ల లెక్కింపుహైకోర్టు డివిజన్‌ బెంచ్‌ నిర్ధేశించిన విధంగాజరగలేదని, బెంచ్‌ అదేశానుసారం ఓటర్ల నిర్దారణజరిగే వరకు ఎన్నికలు నిర్వహించరాదని ఆదేశించాల్సిందిగాకోరుతూ మరో రిట్‌పిటిషన్‌ దాఖలైంది.

1991 జనాభాలెక్కల ప్రకారం కాకుండా 2001 జనాభా లెక్కల ప్రకారంఎస్‌సి, ఎస్‌టి రిజర్వేషన్లు నిర్ణయించాలని రాష్ట్రప్రభుత్వాన్నిఆదేశించాల్సిందిగా అభ్యర్ధిస్తూ ఇంకో పిటిషన్‌దాఖలైంది. ఎస్సీల వర్గీకరణ నేపథ్యంలోఎన్నికలలో కూడా తదనుగుణంగా రిజర్వేషన్లుకల్పించాలని కోరుతూ మరో రిట్‌ పిటిషన్‌ దాఖలైంది.లండాడి తండాలను స్వతంత్ర పంచాయతీలుగాగుర్తించాలని కోరుతూ మరో రిట్‌పిటిషన్‌ కోర్టులోపెండింగ్‌లో వుంది. ఇన్ని రిట్లపై ఈ 12న ఫుల్‌బెంచ్‌విచారణ జరుపుతుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more