వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెస్‌ రాణి తెలుగుతేజం కోనేరు హంపి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః మూడు ప్రపంచచెస్‌ ఛాంపియన్‌ షిప్‌ లు గెలుచుకొని సంచలనం సృష్టించిన తెలుగు క్రీడాకారిణి కోనేరు హంపి ఆదివారం మరో రికార్డు సృష్టించింది. బుడాపెస్ట్‌ లో జరుగుతున్న అంతర్జాతీయచెస్‌ టోర్నమెంట్‌ చివరి రౌండ్‌ మ్యాచ్‌ ను హంపి డ్రా చేయగలిగింది. దీనితో ఆరుపాయింట్లతో హంపి డబ్ల్యూ.జి.ఎం. గ్రాండ్‌ మాస్టర్‌ టైటిస్‌ సాధించింది. ఈ టైటిల్‌ తో పాటు 14 సంవత్సరాల అతి చిన్న వయసులో మహిళా గ్రాండ్‌ మాస్టర్‌ టైటిల్‌ దక్కించుకున్న రికార్డు కూడా హంపి సాధించింది.

శనివారం జరిగిన మ్యాచ్‌ లో హంపి హంగరీ క్రీడాకారణిపై సునాయాసంగావిజయం సాధించింది. దీనితో ఆదివారం జరిగినఫైనల్‌ కు హంపి చేరుకున్నది. ఆదివారం జరిగినఫైనల్‌ లో జర్మనీ క్రీడాకారణి టోబియాస్‌ తో మ్యాచ్‌ డ్రా చేసుకోవడం ద్వారా హంపి ఈ టైటిల్‌ సాధించింది.

గతంలో మహిళా గ్రాండ్‌ మాస్టర్‌ టైటిల్‌ నువిజయలక్ష్మి గెలుచుకుంది. ఈమె కూడా తెలుగుఅమ్మాయి కావడంవిశేషం. అయితే హంపి అతి చిన్నవయసులో మహిళా గ్రాండ్‌ మాస్టర్‌ టైటిల్‌ సాధించిన క్రీడాకారణిగా రికార్డులకు ఎక్కింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X