వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కారుచౌకగా ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై: చెన్నైలోని ఐఐటి ఇన్‌క్యూబెట్‌ చేసిన ఒక టెక్నాలజీ సంస్థ కారుచౌకగా టెలీకామ్‌, ఇంటర్నెట్‌ నెట్‌వర్కింగ్‌ను అందజేయగల టెక్నాలజీని డెవలప్‌చేసింది. ఈ టెక్నాలజీ గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనికేషన్ల రంగంలో విప్లవాన్ని సృష్టించగలదని అంటున్నారు.

కార్డెక్ట్‌ వైర్‌లెస్‌ ఇన్‌ లోకల్‌ లూప్‌ ఆధారంగా డెవలప్‌ చేసిన ఈ టెక్నాలజీ వల్ల కేవలం 35,40 వేల రూపాయలకే గ్రామాల్లో ఇంటర్నెట్‌, టెలీఫోన్‌ కియాస్క్‌లను ఏర్పాటు చేయడానికి అవకాశం వుంటుంది. నెట్‌వర్క్‌కు అవసరమైన మౌలికవసతులను చెన్నై ఐఐటి ఇన్‌క్యూబెట్‌ చేసిన ఎన్‌-లాగ్‌ అనే సంస్థ సమకూరుస్తుంది.

ఈ టెక్నాలజీ ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో తాము పైలెట్‌ ప్రాజెక్టు చేపట్టినట్టుగా ఎన్‌-లాగ్‌ సారధి ప్రొఫెసర్‌ అశోక్‌ ఝంజున్‌వాలా చెప్పారు. కుప్పం పైలెట్‌ ప్రాజెక్టు విజయం తర్వాత తమిళనాడులోని నెల్లికుప్పం, కడలూరులో కూడా ఈ ప్రాజెక్టును చేపట్టినట్టుగా ఆయన వెల్లడించారు. రాజస్థాన్‌లోని సికార్‌లో మొత్తం 1500 గ్రామాల్లో కియాస్క్‌ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా ఆయన వెల్లడించారు.

రాజస్థాన్‌ ప్రాజెక్టుకు నాబార్డ్‌ రుణసాయం అందజేస్తున్నదని ఆయన తెలిపారు. కనెక్టివిటీ వున్న దేశంలోని 150 నగరాలను మినహాయిస్తే కనెక్టివిటీ లేని చోట్లలో తమ టెక్నాలజీతో నెట్‌ ఆక్సెస్‌ కల్పించవచ్చని అశోక్‌ ఝంజున్‌వాలా చెప్పారు. తమ నెట్‌వర్క్‌తో అంతర్‌గ్రామ కమ్యూనికేషన్‌ సౌకర్యం కూడా కల్పించవచ్చని ఆయన వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోకమ్యూనికేషన్‌ సౌకర్యం పెంపుదలకు ప్రభుత్వం స్పెక్ట్రమ్‌ చార్జీలు లేకుండా లైసెన్స్‌ ఫీజు బెడదలేకుండా నెట్‌వర్క్‌ ఏర్పాటుకు ఆపరేటర్లను ప్రొత్సహించాలని ఆయన సూచించారు.

  • హార్డ్‌వేర్‌పై జాతీయ సదస్సు
  • నెట్‌జనుల సంఖ్య 43 కోట్ల
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X