నెట్జనులసంఖ్య 43 కోట్లు
సింగపూర్: ప్రపంచవ్యాప్తంగా నెట్ ఆక్సెస్ వున్నవారి సంఖ్య 42 కోట్లా 90 లక్షలు వున్నట్టు నెల్సన్ నెట్రేటింగ్స్ అనే సంస్థ అధ్యయనంలో వెల్లడయింది. ఈ మొత్తం నెట్జనుల్లో అమెరికా,కెనడా రెండు దేశాల వాటానే 41 శాతం వుంది. అయితే క్రమంగా ఆసియాలో కూడా ఇంటర్నెట్ ఆక్సెస్ విస్తరిస్తున్నది.
ఆసియా వాటా ప్రస్తుత లెక్కల ప్రకారం ఒకటింట ఆయిదో వంతు మాత్రమే వుంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో హాంగ్‌కాంగ్, దక్షిణకోరియా, సింగపూర్ నెట్ ఆక్సెస్లో అగ్రస్థానంలో వున్నాయి. ఈ దేశాల్లో ఇంటర్నెట్ గృహవినియోగం హెచ్చుగా వుంది. అదే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో అత్యధిక శాతం మంది కార్యాలయాల్లోనే నెట్సర్ఫింగ్ చేస్తున్నారు. పసిఫిక్ తీర దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో పోలిస్తే ఆసియా దేశాల్లోనే డొమెస్టిక్ ఇంటర్నెట్ ఆక్సెస్ చాలా ఎక్కువ. సింగపూర్‌లో ఆన్లైన్ షాపింగ్‌కు ఈమధ్య ఆదరణ బాగా పెరుగుతున్నది.
- హార్డ్వేర్పై జాతీయ సదస్సు
-
కారుచౌకగా
ఇంటర్నెట్
నెట్వర్క్