• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జులై 23 నుంచి పార్లమెంట్‌

By Staff
|

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జులై 23 నుంచిప్రారంభమై ఆగస్టు 31 వరకు కొనసాగుతాయి. ఈ విషయం పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ మంత్రి ప్రమోద్‌మహాజన్‌ తెలిపారు. హోం మంత్రి, ఇన్‌చార్జ్‌ ప్రధాని ఎల్‌కె అద్వానీ సారధ్యంలో గురువారం నాడు కేంద్ర కేబినెట్‌ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల తేదీని ఖరారు చేశారు. 40 రోజుల్లో సెలవులు పోను సభ 29 రోజులు సమావేశం అవుతుంది. సాధరణంగా వర్షాకాల సమావేశాలతో పోలిస్తే ఈ సారి సమావేశాల వ్యవధి ఎక్కువగా వుంది. లోక్‌సభలో 28 బిల్లులు పెండింగ్‌లో వున్నాయని, రాజ్యసభలో 48 బిల్లులు పెండింగ్‌లో వున్నాయని ఈ సమావేశాల్లో మరో మూడు ఆర్డినెన్స్‌లను చట్టం చేయాల్సి వున్నదని ప్రమోద్‌ మహాజన్‌ తెలిపారు.

తహల్కా దుమారం కారణంగా గత పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగకపోవడం వల్ల ఈ సారి సమావేశాలను పొడిగించాలని నిర్ణయించారు.మోకాలి శస్త్ర చికిత్స కారణంగా ముంబాయిలోని బ్రీచ్‌కాండీ ఆస్పత్రిలో వున్న ప్రధాని వాజ్‌పేయి తన పరోక్షంలో అధికార బాధ్యతలను అద్వానీ నిర్వహిస్తారని విస్పష్టంగా ఉత్తర్వులు జారీ చేయడంతో కేబినెట్‌ సమావేశం అద్వానీ సారధ్యంలో జరిగింది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహం, దేశంలో శాంతిభద్రతల పరిస్థితి వంటి అంశాలపై కూడా సమావేశం చర్చించినట్టుగా తెలిసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X