వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

xహురియత్‌ నేతల గృహనిర్బంధం

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: జమ్మూ కాశ్మీర్‌లోని ప్రధాన రాజకీయ పక్షం ఆల్‌పార్టీహురియత్‌ కాన్ఫరెన్స్‌కు చెందిన ఆరుగురు అగ్రశ్రేణి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హురియత్‌ చైర్మన్‌ అబ్దుల్‌ గనీభట్‌తో సహా అరెస్టు చేసిన ఆరుగురు నేతలను గృహనిర్బంధంలో వుంచారు.

భద్రతాదళాల దమనకాండకు నిరసనగా పెద్దఎత్తున ప్రదర్శనలు చేయడానికి హురియత్‌ నేతలు సన్నాహాలు చేస్తుండటం వల్ల హురియత్‌నేతలను అరెస్టు చేయాల్సివచ్చిందని అధికారులు ప్రకటించారు. శుక్రవారం నాడు వేకువనే పెద్దఎత్తున పోలీసు బలగాలు హురియత్‌ చైర్మన్‌ ఇంటిని చుట్టుముట్టాయి.

లోపలివారిని బయటకు బయటవారిని లోపలికి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. పోలీసులు ఇంటిని దిగ్బంధం చేసిన సమయంలో లోపల గులాంనబి సువ్జీు, షబ్బీర్‌దార్‌, అబ్దుల్‌ రషీద్‌అంతూ, అల్తాఫ్‌ అహ్మద్‌ వున్నారని పోలీసులు చెప్పారు. కాగా హురియత్‌మరో సీనియర్‌ నేత జిలానీని అనంతనాగ్‌లో అరెస్టు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X